News June 26, 2024

ఏపీ అభివృద్ధికి సాధ్యమైనంత కృషి చేస్తాం: ప్రధాని మోదీ

image

AP: టీడీపీకి చెందిన 16 మంది ఎంపీలు తనను కలవడంపై ప్రధాని మోదీ Xలో పోస్ట్ పెట్టారు. ‘టీడీపీకి చెందిన సభ్యులు కలిశారు. నా మిత్రుడు చంద్రబాబు నాయకత్వంలో మా పార్టీలు కేంద్రంలో, ఏపీలో చాలా సన్నిహితంగా పనిచేస్తున్నాయి. భారతదేశ ప్రగతికి, ఏపీ అభివృద్ధికి సాధ్యమైనదంతా చేస్తాం’ అని రాసుకొచ్చారు.

Similar News

News February 18, 2025

భారత జట్టుకు స్పెషల్ నంబర్ ‘183’

image

భారత క్రికెట్ జట్టుకు 183 అనే నంబర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1983లో IND తొలి వరల్డ్ కప్ సాధించింది. ఆ ఫైనల్‌లో విండీస్‌పై భారత్ 183 స్కోరుకు ఆలౌటైంది. అలాగే కెప్టెన్లుగా పనిచేసిన గంగూలీ, ధోనీ, కోహ్లీల వ్యక్తిగత అత్యధిక స్కోరు 183. అయితే ఆ స్కోరు చేసినప్పుడు వారంతా సాధారణ ప్లేయర్లే. గంగూలీ 1999లో, ధోనీ 2005లో శ్రీలంకపై, కోహ్లీ 2012లో పాక్‌పై ఈ స్కోర్లు చేశారు.

News February 18, 2025

BREAKING: టికెట్లు విడుదల

image

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News February 18, 2025

Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్‌సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.

error: Content is protected !!