News March 17, 2024
అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేస్తాం: CM

TG: ఒకే వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ స్పందించారు. ‘నా పేషీలో బ్రాహ్మిణ్, ముస్లిం, దళిత్, ఓబీసీ నుంచి ఒక్కొక్కరు, ఇద్దరు రెడ్లున్నారు. నలుగురిని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులుగా తీసుకుంటే.. అందులో ముస్లిం, దళిత్, రెడ్డి, బ్రాహ్మిణ్ ఉన్నారు. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలోనూ సామాజిక న్యాయం పాటించాం’ అని అన్నారు. సోషల్ మీడియాలో విమర్శలను పట్టించుకోవద్దన్నారు.
Similar News
News February 16, 2025
మహిళలు ఎక్కువగా మద్యం తాగే రాష్ట్రమిదే

మద్యం తాగే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉందని కేంద్ర సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 15-49ఏళ్ల స్త్రీల సగటు మద్యపానం 1.2% ఉండగా, అస్సాంలో ఇది 16.5% ఉంది. తర్వాతి స్థానాల్లో మేఘాలయ(8.7%), అరుణాచల్(3.3%) ఉన్నాయి. గతంలో టాప్‌లో ఉన్న ఝార్ఖండ్(9.9%), త్రిపుర(9.6%) తాజా సర్వేలో వరుసగా 0.3, 0.8 శాతానికి తగ్గిపోయాయి. మెట్రోపాలిటన్ రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక ఈ లిస్టులో లేకపోవడం గమనార్హం.
News February 16, 2025
OTTలోకి వచ్చేసిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

కిచ్చా సుదీప్ నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే ఓటీటీలోకి తీసుకురావడం విశేషం. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం DEC 25న విడుదలై దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో సునీల్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.
News February 16, 2025
ఈ ఆహారాలను మళ్లీ వేడి చేసి తింటున్నారా?

మనలో చాలా మంది మిగిలిపోయిన ఆహారాలను ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసుకుని తింటుంటారు. ఇది చాలా హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీఫుడ్, ఆకుకూరలు, గుడ్లు, బంగాళదుంపలు, కాఫీ, టీ, అన్నం, వేయించిన పదార్థాలను మరోసారి వేడి చేస్తే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వాటిలో పోషకాలు, ఖనిజాలు నాశనమవుతాయని, బ్యాక్టీరియా పెరుగుతుందని, జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.