News December 14, 2024
గురుకులాల ఇమేజ్ పెంచుతాం: సీఎం రేవంత్
TG: గురుకులాల్లో చదివిన వారు ప్రతిష్ఠాత్మక పదవులు చేపట్టారని CM రేవంత్ అన్నారు. గురుకుల విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీస్తామని చెప్పారు. చిలుకూరులో జరిగిన ‘గురుకులాల బాట’లో CM మాట్లాడారు. ‘ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే గురుకుల విద్యార్థులు తక్కువనే అపోహ ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తాం. రెసిడెన్షియల్ స్కూళ్లకు కామన్ డైట్ రూపొందించాం. గురుకులాలను ప్రక్షాళన చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 17, 2025
30లక్షల శునకాలను వధించే యోచనలో మొరాకో?
FIFA ప్రపంచ కప్-2030 నేపథ్యంలో మొరాకోలోని పలు నగరాలను వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు సందర్శించనున్నారు. అందుకు అనుగుణంగా నగరాలు మరింత అందంగా కనిపించేందుకు 30 లక్షల వీధి కుక్కలను వధించాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని జంతు హక్కుల ప్రచారకర్త జేన్ గుడాల్ ఖండించారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ అసోసియేషన్‌ను సంప్రదించి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News January 17, 2025
అర్జున అవార్డు అందుకున్న దీప్తి జీవాంజి
పారాలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన తెలుగు తేజం దీప్తి జీవాంజి అర్జున అవార్డు అందుకున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా దీప్తి అవార్డు తీసుకున్నారు. వరంగల్ జిల్లా కల్లెడకు చెందిన దీప్తి పారాలింపిక్స్ ఉమెన్స్ 400మీ పరుగులో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించారు.
News January 17, 2025
Veg Mode Fee వసూలుపై జొమాటో CEO క్షమాపణలు
కొత్తగా తెచ్చిన ‘వెజ్ మోడ్ ఎనేబుల్‌మెంట్ ఫీ’పై విమర్శలతో జొమాటో వెనక్కి తగ్గింది. తాను వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినందుకు అదనంగా ₹2 ఛార్జ్ చేయడంపై ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘దేశంలో శాకాహారిగా ఉండటం ఖర్చుతో కూడుకున్నది’ అని జొమాటో CEOను ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశాడు. ఇది వైరల్ కాగా స్పందించిన CEO దీపిందర్, తప్పుకు క్షమాపణ కోరడంతో పాటు ఈ స్టుపిడ్ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేస్తానన్నారు.