News June 19, 2024

ఆ సిటీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్

image

కర్ణాటక హుబ్బళ్లిలోని డెవలప్మెంట్ సెంటర్‌లో పని చేసేందకు ఉద్యోగులు ఆసక్తి చూపించకపోవడంతో వారికి ఇన్ఫోసిస్ ఆఫర్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చి పనిచేస్తే ₹8లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. కనిష్ఠంగా బ్యాండ్-3 అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు రెండేళ్లలో రూ.1.25లక్షల ప్రోత్సాహకం ఇస్తామంది. ఇక బ్యాండ్ 4- ₹2.5లక్షలు, బ్యాండ్ 5- ₹5లక్షలు, బ్యాండ్ 6- ₹8లక్షల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.

Similar News

News December 6, 2025

BECILలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి. వెబ్‌సైట్: https://www.becil.com

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి లక్షణాలు

image

కోడి ముక్కు నుంచి చిక్కని ద్రవం కారుతుంది. పచ్చటి, తెల్లటి నీళ్ల విరేచనాలు అవుతాయి. కాళ్లు, మెడ, రెక్కల్లో పక్షవాతం లక్షణాలు కనిపిస్తాయి. మెడ వంకర్లు తిరిగి, రెక్కలు, ఈకలు ఊడిపోతాయి. గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. శ్వాస సమయంలో శబ్దం, నోరు తెరిచి గాలి తీసుకోవడం కనిపిస్తుంది. తోలు గుడ్లు పెడతాయి. మేత తీసుకోవు. కోళ్లన్నీ బాగా నీరసించి పల్టీలు కొడుతూ వ్యాధి సోకిన 3 నుంచి 4 రోజుల్లో మరణిస్తాయి.

News December 6, 2025

ఇతిహాసాలు క్విజ్ – 88

image

ఈరోజు ప్రశ్న: విష్ణుమూర్తిని శ్రీనివాసుడు అని ఎందుకు పిలుస్తారు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>