News June 19, 2024
ఆ సిటీలో పనిచేస్తే ప్రోత్సాహకాలు ఇస్తాం: ఇన్ఫోసిస్

కర్ణాటక హుబ్బళ్లిలోని డెవలప్మెంట్ సెంటర్‌లో పని చేసేందకు ఉద్యోగులు ఆసక్తి చూపించకపోవడంతో వారికి ఇన్ఫోసిస్ ఆఫర్ ఇచ్చింది. ఇక్కడికి వచ్చి పనిచేస్తే ₹8లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపింది. కనిష్ఠంగా బ్యాండ్-3 అంతకంటే దిగువస్థాయి ఉద్యోగులకు రెండేళ్లలో రూ.1.25లక్షల ప్రోత్సాహకం ఇస్తామంది. ఇక బ్యాండ్ 4- ₹2.5లక్షలు, బ్యాండ్ 5- ₹5లక్షలు, బ్యాండ్ 6- ₹8లక్షల ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.
Similar News
News January 23, 2026
వరుసగా 3 రోజులు సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లో కొందరికి వరుసగా 3 రోజులు సెలవులు రానున్నాయి. సాఫ్ట్‌వేర్ సహా పలు కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు సోమవారం రిపబ్లిక్ డే రావడంతో లాంగ్ వీకెండ్ కానుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూళ్లు సైతం వారానికి 5 రోజులే నడుస్తుండటం, 26న పబ్లిక్ హాలిడే కావడంతో స్టూడెంట్స్ రేపట్నుంచి 3 రోజులు సెలవులను ఎంజాయ్ చేయనున్నారు.
News January 23, 2026
APPLY NOW: SACONలో 36 పోస్టులు

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ(<
News January 23, 2026
వసంత రుతువులో ప్రకృతి ఎందుకు పులకరించిపోతుందో తెలుసా?

వసంత పంచమికి, ప్రేమ దేవుడు మన్మథుడితో సంబంధం ఉంది. శివుడి ధ్యానాన్ని భంగం కలిగించి, పార్వతీ దేవిపై ఆయనకు అనురాగం కలిగేలా చేయడానికి మన్మథుడు పూబాణాలు ప్రయోగించిన రోజు ఇదేనట. దీంతో శివుడు మూడో కంటితో మన్మథుడిని భస్మం చేశాడు. రతీదేవి వేడుకోలుపై తిరిగి ప్రాణం పోశాడు. ఈ కాలంలో కొత్త చిగుళ్లతో ప్రకృతి పులకించేలా చేసేది మన్మథుడని నమ్ముతారు. అందుకే ఈరోజును ప్రేమకు, సృజనాత్మకతకు ప్రతీకగా చెబుతారు.


