News February 17, 2025
స్కూళ్ల కోసం రూ.2000 కోట్లు ఇస్తాం: అదానీ గ్రూప్

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్‌లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.
Similar News
News January 1, 2026
ESIC హాస్పిటల్, నవీ ముంబైలో ఉద్యోగాలు

<
వెబ్సైట్: https://esic.gov.in
News January 1, 2026
సర్ఫరాజ్‌ను నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటు: వెంగ్‌సర్కార్

దేశవాళీ క్రికెట్లో భారీగా రన్స్ చేస్తున్న ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌కు నిరాశే ఎదురవుతోంది. VHTలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 చేసి సంచలనం సృష్టించాడు. నిలకడగా రాణిస్తున్నప్పటికీ అతడికి టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ చీఫ్ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అసహనం వ్యక్తం చేశారు. “ఇది నిజంగా సిగ్గుచేటు. మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టడం అన్యాయం” అంటూ విమర్శలు గుప్పించారు.
News January 1, 2026
చెడు శకునాలు ఎదురైతే?

చెడు శకునాలు ఎదురైనా, అశుభ సంకేతాలు కనిపించినా కొన్ని మార్గాలతో దోష నివారణ చేసుకోవచ్చు. ‘పసుపు కలిపిన గంగాజలంతో ఇంటిని శుద్ధి చేయాలి. ఇష్టదైవాన్ని స్మరిస్తూ విభూతి, తులసి తీర్థం చల్లాలి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. విజ్ఞులు, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. దానధర్మాల వల్ల ఆపదల తీవ్రత తగ్గుతుంది. శకునాలు హెచ్చరికలు మాత్రమేనని, సత్కర్మలు, దైవ ప్రార్థన ద్వారా కష్టాలను దాటొచ్చని పండితులు చెబుతున్నారు.


