News July 28, 2024
ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ప్రభుత్వానికి రుచి చూపిస్తాం: చెవిరెడ్డి
AP: తన కుమారుడు మోహిత్ రెడ్డిని <<13721857>>అరెస్టు<<>> చేయడంపై చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. ‘నా కొడుకుకు 25 ఏళ్లు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రజా జీవితంలోకి వచ్చాడు. ఇప్పుడు అక్రమ కేసులో అరెస్ట్ చేయించారు. నా కొడుకుని వీధి పోరాటాలకు సిద్ధం చేస్తున్న చంద్రబాబుకు కృతజ్ఞతలు. ప్రజా పోరాటాలు ఎలా ఉంటాయో ఈ ప్రభుత్వానికి రుచి చూపిస్తాం’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 16, 2024
వాయుగుండంపై LATEST UPDATE
AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం వాయువ్య దిశగా 12KM వేగంతో కదులుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. చెన్నైకి 360KM, పుదుచ్చేరికి 390KM, నెల్లూరుకు 450KM దూరంలో ఉన్నట్లు పేర్కొంది. ఇది రేపు తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
News October 16, 2024
INDvsNZ: తొలి రోజు ఆట అనుమానమే!
న్యూజిలాండ్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా ఇవాళ తొలి టెస్టు ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం కారణంగా టాస్ వాయిదా పడింది. కాసేపటి క్రితమే వాన ఆగిపోయినట్లు తెలుస్తోంది. మళ్లీ వర్షం మొదలైతే తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉంది. కాగా బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో బెంగళూరులో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
News October 16, 2024
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ వినియోగదారులకు పసిడి ధరలు షాక్ ఇస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ రూ.78వేలకు చేరువైంది. నిన్న, మొన్నటి వరకు కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.490 పెరిగి రూ.77,890కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రూ.450 పెరిగి రూ.71,400గా నమోదైంది. అటు సిల్వర్ రేట్ రూ.100 తగ్గింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.96,800గా ఉంది.