News November 4, 2024
వరల్డ్ టాప్-5 సిటీల్లో అమరావతిని నిలుపుతాం: మంత్రి నారాయణ
AP: ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి నగరాల్లో అమరావతి నిలిచేలా చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాజధానితో మూడుముక్కలాట ఆడిందని విమర్శించారు. ప్రస్తుతం రూ.30వేల కోట్లకు సంబంధించి టెండర్ పనులు మొదలయ్యాయని తెలిపారు. డిసెంబర్ చివరికల్లా అన్ని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. వరల్డ్ బ్యాంక్ రూ.15వేల కోట్ల రుణమిస్తోందని, 3ఏళ్లలో పనులు పూర్తి కావాలని CM ఆదేశించారన్నారు.
Similar News
News December 8, 2024
నాగచైతన్య-శోభిత పెళ్లి.. మరికొన్ని ఫొటోలు
నాగచైతన్య-శోభితల వివాహం ఈ నెల 4న అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా వీరి పెళ్లి వేడుకకు సంబంధించి మరికొన్ని ఫొటోలను శోభిత పంచుకున్నారు. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ తలంబ్రాల బట్టలు ప్రధానం చేయడం, తలంబ్రాలు వేయడం, అరుంధతీ నక్షత్రం చూపించడం వంటి సందర్భాల ఫొటోలు పోస్ట్ చేశారు. దీంతో ఈ జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
News December 8, 2024
రామప్పకు రూ.73 కోట్ల నిధులు విడుదల
TG: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.73 కోట్ల నిధులు కేటాయించింది. ఈమేరకు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేస్తూ జీవో జారీ చేసింది. కేంద్ర పథకం కింద స్థానికంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలతో పాటు గార్డెన్, యాంఫీ థియేటర్, లేక్ వ్యూ కాటేజీలు, ఆట స్థలాలు, బోటింగ్ పాయింట్ నిర్మించనున్నారు.
News December 8, 2024
ఈ ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు: VSR
AP: విశాఖలో దొరికిన కంటైనర్‌లో డ్రగ్స్ లేవని <<14811211>>సీబీఐ <<>>నిర్ధారించడంపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. ‘చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్‌లో డ్రగ్స్ దొరికిందని పోలింగ్‌కు నెలన్నర ముందు ఓటర్లను మోసం చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింక్ పెట్టి మరీ అప్పుడు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు’ అని VSR డిమాండ్ చేశారు.