News June 18, 2024
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఏపీని నంబర్-1 చేస్తాం: సత్యకుమార్ యాదవ్

AP: గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు తిరోగమించిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ధర్మవరంలో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి సహజ వనరులను దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఏపీని నంబర్-1 చేస్తామని తెలిపారు. చితికిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతామని చెప్పారు.
Similar News
News January 19, 2026
2030 కల్లా అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా భారత్: SBI

భారత్ ఆర్థికంగా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోందని SBI తాజా రిపోర్ట్ వెల్లడించింది. 2028 కల్లా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని తెలిపింది. 2030నాటికి ‘అప్పర్ మిడిల్ ఇన్‌కమ్’ దేశాల క్లబ్‌లో చేరనుందని పేర్కొంది. అప్పటికీ మన తలసరి ఆదాయం $4,000 (దాదాపు రూ.3,63,541) మార్కును తాకడం ఖాయమని అంచనావేసింది. 2047నాటికి ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత్ గ్లోబల్ లీడర్‌గా నిలవనుందని తెలిపింది.
News January 19, 2026
‘దండోరా’పై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు

శివాజీ, నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో నటించిన ‘దండోరా’ సినిమాపై హీరో Jr NTR ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా గాఢమైన భావోద్వేగాలతో ఆలోచింపజేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. నటీనటులందరి ప్రదర్శన అద్భుతమని తెలిపారు. దర్శకుడు మురళీకాంత్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా JAN 14 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
News January 19, 2026
గంటా 45 నిమిషాల మీటింగ్ కోసం 6 గంటల ప్రయాణం.. ఏదో ఉంది?

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ UAE అధ్యక్షుడు అల్ నహ్యాన్ భారత పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. కేవలం గంటా 45 నిమిషాల కోసం ఆయన ఆరు గంటలు ప్రయాణించడం గమనార్హం. ఇరాన్ కల్లోలం, సౌదీ-UAE మధ్య యెమెన్ చిచ్చు, గాజా శాంతి చర్చల వంటి ఇష్యూస్ నేపథ్యంలో ఫోన్లో కాకుండా నేరుగా చర్చించేంత బలమైన విషయమేదో ఉందని దౌత్య వర్గాల్లో చర్చ జరుగుతోంది. భారత్‌ను బలమైన భాగస్వామిగా UAE నమ్ముతోంది.


