News March 28, 2024
అగ్నివీర్ స్కీమ్లో అవసరమైతే మార్పులు చేస్తాం: రాజ్నాథ్

భారత సైన్యంలోకి యువతను చేర్చుకునే అగ్నివీర్ పథకంలో అవసరమైతే మార్పులు తీసుకొస్తామని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వాళ్ల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. అగ్నివీర్ల కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్లు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే చెప్పారు. అగ్నివీర్ల సర్వీస్ కాలం నాలుగేళ్లు కాగా మెరిట్ ఆధారంగా ప్రతి బ్యాచ్లో 25% మందిని 15 ఏళ్లు పొడిగిస్తారు.
Similar News
News December 11, 2025
గురువారం బృహస్పతిని పూజిస్తే..

మహావిష్ణువుతో పాటు బృహస్పతిని కూడా గురువారం ఆరాధించడం వల్ల కుటుంబంలో శాంతి, సిరిసంపదలు, సంతోషం కలుగుతాయని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు. దత్తాత్రేయుడిని కూడా పూజించవచ్చని అంటున్నారు. ఈ వారానికి అధిపతి అయిన బృహస్పతిని ప్రసన్నం చేసుకోవడానికి అరటి బోదెలో దీపం వెలిగించడం, పసుపు దుస్తులు ధరించడం, అదే రంగు పూలు సమర్పించడం శుభప్రదం. నెయ్యి, బెల్లంతో నైవేద్యం పెట్టాలి’ అని చెబుతున్నారు.
News December 11, 2025
నిద్ర తక్కువైతే!

నిద్ర తక్కువైతే ఆరోగ్యం దెబ్బతిని గుండె జబ్బులు, బీపీ, మతిమరుపు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘కొన్ని రోజులు సరైన నిద్ర లేకుంటే రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఏకాగ్రత లోపించడం, నిరాశ, కుంగుబాటు వంటివి పెరుగుతాయి. దీర్ఘకాలిక నిద్రలేమి ఆయుష్షునూ తగ్గిస్తుంది’ అని చెబుతున్నారు. మంచి నిద్ర కోసం ధ్యానం, స్క్రీన్ టైమ్ తగ్గించడం, క్రమమైన నిద్ర సమయాలు పాటించాలని సూచిస్తున్నారు.
News December 11, 2025
రోహిత్ గొప్ప హృదయానికి అది నిదర్శనం: జైస్వాల్

సౌతాఫ్రికాతో ఇటీవల భారత్ ఆడిన మూడో వన్డేలో యశస్వి జైస్వాల్ తన కెరీర్లోనే తొలి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అయితే క్రీజులో కుదురుకునేందుకు ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో మరో ఎండ్లో ఉన్న రోహిత్ తనతో మాట్లాడుతూ భరోసా ఇచ్చినట్లు జైస్వాల్ తెలిపారు. ‘నేను రిస్క్ తీసుకుంటా. నువ్వు ప్రశాంతంగా టైం తీసుకొని ఆడు’ అని తనతో చెప్పినట్లు వివరించారు. ఇది తన గొప్ప హృదయానికి నిదర్శనం అని కొనియాడారు.


