News April 6, 2025
తెలంగాణకు అన్యాయం జరగనివ్వం: ఉత్తమ్

TG: కృష్ణా, గోదావరి జలాలపై ఈ నెల 15, 16, 17 తేదీల్లో జరిగే న్యాయవిచారణకు తాను హాజరవుతానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జలవివాదాలపై వాదనలు వినిపిస్తున్న న్యాయబృందంతో ఆయన చర్చలు జరిపారు. ‘నీటి కేటాయింపులు సరిగ్గా లేకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఉన్న నిర్ణయాలను సరిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఒక్క అవకాశం కూడా వదులుకోం’ అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
Similar News
News April 8, 2025
ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’

AP: వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 15 నుంచి ఇంటింటికీ ‘మన మిత్ర’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తున్న 250కు పైగా సేవలపై అవగాహన కల్పించనున్నారు. వారి ఫోన్లలో మన మిత్ర నంబర్(9552300009)ను సేవ్ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది.
News April 8, 2025
చరిత్ర సృష్టించిన రజత్ పాటీదార్

ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సరికొత్త ఘనత సాధించారు. IPL సింగిల్ ఎడిషన్‌లో MIని వాంఖడే, KKRను ఈడెన్‌లో, CSKను చెపాక్‌లో ఓడించిన తొలి కెప్టెన్‌గా చరిత్ర సృష్టించారు. గతంలో పంజాబ్ ఈ ఫీట్ సాధించినా ఇద్దరు నాయకుల సారథ్యంలో నమోదైంది. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (KKR), డేవిడ్ హస్సీ (CSK, MI) కలిసి ఈ రికార్డు నెలకొల్పారు. కోహ్లీకి కూడా సాధ్యం కాని రికార్డును పాటీదార్ సాధించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
News April 8, 2025
PM మోదీ రిటైర్మెంట్‌పై మహారాష్ట్ర CM ఆసక్తికర వ్యాఖ్యలు

PM మోదీ రిటైర్మెంట్‌పై పలు ఊహాగానాల నేపథ్యంలో మహారాష్ట్ర CM ఫడ్నవీస్ స్పందించారు. 2029 తర్వాత కూడా మోదీ దేశాన్ని నడిపిస్తారని అన్నారు. ‘మోదీ వారసుడి గురించి చర్చించేందుకు ఇది సరైన సమయం కాదు. 2029లో ఆయన మళ్లీ PM అవుతారు’ అని పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో మోదీ రిటైరవుతారని ఇటీవల శివసేన UBT నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిిందే. కాగా SEPలో మోదీ 75వ పడిలోకి అడుగుపెట్టబోతున్నారు.