News September 9, 2024
ప్రభుత్వంలో మేం భాగస్వామ్యం కాదు: కూనంనేని
TG: ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ మాత్రమే చేశామని, ప్రభుత్వంలో CPI భాగస్వామ్యం కాదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. పార్టీ మారిన MLAల పదవిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపు MLAలపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. వరదలను జాతీయ విపత్తుగా పరిగణించి కేంద్రం TGకి రూ.6వేల కోట్లు ఇవ్వాలని కోరారు. SEP 11-17 వరకు రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుతామన్నారు.
Similar News
News October 15, 2024
అనిల్ అంబానీని లాభాల్లోకి తెచ్చిన వారసులు
నష్టాలు, అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీని ఆయన కుమారులు అన్‌మోల్, అన్షుల్ లాభాల్లోకి తీసుకువచ్చి సగర్వంగా తలెత్తుకునేలా చేశారు. వారి రాకతో రిలయన్స్ పవర్ రూ.20,526 కోట్ల విలువైన కంపెనీగా నిలబడింది. రిలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, రిలయన్స్ క్యాపిటల్ సంస్థలూ లాభాల బాట పట్టడంతో కొడుకులను చూసి అనిల్ మురిసిపోతున్నారు. ఇదే ఉత్సాహంతో అనిల్ భూటాన్‌లో సోలార్, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను చేపడుతున్నారు.
News October 15, 2024
వ్యాయామం ఎంతసేపు చేయాలంటే?
ఆరోగ్యంగా ఉండాలన్నా, బరువు తగ్గాలన్నా వ్యాయామం చేయాలి. కానీ రోజుకు ఎంత సేపు చేయాలి, ఎలా చేయాలనే దానిపై కొందరికి అవగాహన ఉండదు. వారంలో 5 రోజులపాటు గంట చొప్పున ఎక్సర్‌సైజ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఆహారపు అలవాట్లు అదుపులో పెట్టుకుని వ్యాయామం చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అయ్యి బరువు తగ్గుతారు. అలాగే నడక కూడా మన ఆరోగ్యం విషయంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ వీలైనంత దూరం నడక కొనసాగించాలి.
News October 15, 2024
RED ALERT: ఈ జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారత వాతావరణ విభాగం (IMD) నేడు ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.