News September 27, 2024
ఉగ్రవాదాన్ని అంతం చేసేవరకూ విశ్రమించం: అమిత్ షా
జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం జారీ చేశారు. వారు ఉగ్రవాదాన్ని వదలకపోతే భారత జవాన్ల చేతిలో చావు తప్పదని ఎన్నికల సభలో హెచ్చరించారు. ‘జమ్మూకశ్మీర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అక్కడ అలజడి సృష్టించేందుకు యత్నించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉగ్రవాదాన్ని పాతాళానికి తొక్కే వరకూ విశ్రమించం. గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్, ఎన్‌సీ ఉగ్రవాదాన్ని పోషించాయి’ అని విమర్శించారు.
Similar News
News October 7, 2024
5Gపై ఫోకస్ తగ్గించిన రిలయన్స్ JIO
JIO 5G నెట్‌వర్క్ విస్తరణ వేగాన్ని తగ్గిస్తోంది. 4G యూజర్లు ఎక్కువ డబ్బులు చెల్లించే సేవలకు అప్‌గ్రేడ్ అవ్వడంపై ఫోకస్ పెట్టింది. Airtel సైతం ఫీచర్ ఫోన్లు వాడేవారిని స్మార్ట్ ఫోన్ల వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. ఇవి వేగం పుంజుకొనేంత వరకు అవసరమైన 5G ఆపరేషన్స్ మాత్రమే కొనసాగిస్తాయని తెలిసింది. జియో 5G నెట్‌వర్క్ యుటిలైజేషన్ 15% ఉందని వెండర్స్, రెట్టింపు ఉంటుందని కంపెనీ సోర్సెస్ అంటున్నాయి.
News October 7, 2024
అల్పపీడనం ఎఫెక్ట్.. రేపు భారీ వర్షాలు
ఏపీలో అల్పపీడన ప్రభావంతో ఇవాళ పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, ప్రకాశం, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
News October 7, 2024
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధానికి ఏడాది పూర్తి అయింది. 2023, అక్టోబర్ 7న హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. పిల్లలు, యువతుల్ని బందీలుగా తీసుకెళ్లడంతో పాలస్తీనాలో IDF ఏరివేత మొదలు పెట్టింది. దీంతో లక్షలాది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. మధ్యలో బందీలను ఎక్స్‌ఛేంజ్ చేసుకున్నా హెజ్బొల్లా దూరడంతో వివాదం మరో టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఇరాన్‌తో ప్రత్యక్ష యుద్ధం స్థాయికి చేరింది.