News February 4, 2025
ఆలయాల పవిత్రతను కాపాడతాం: మంత్రి

AP: రాష్ట్ర చరిత్ర, పవిత్రతను భవిష్యత్తు తరాలకు అందిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఆలయాల పునః నిర్మాణానికి నిధులను కేటాయిస్తున్నామన్నారు. ఇప్పటికే నెల్లూరు(D)లో 18 ఆలయాలకు రూ.38కోట్లు రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం సూచనతో రథ సప్తమిని రాష్ట్ర పండుగగా గుర్తించామన్నారు. రాతి కట్టడాలకు గత ప్రభుత్వం రంగులు వేయడంతో పవిత్రతను కోల్పోయాయని, ఆ రంగులను తొలగిస్తామని తెలిపారు.
Similar News
News February 19, 2025
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
News February 19, 2025
నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 19, 2025
టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.