News August 8, 2024

సిల్వర్ మెడలిస్ట్ రివార్డులు, సౌకర్యాలు వినేశ్‌కు అందిస్తాం: సీఎం

image

రెజ్లర్ వినేశ్ ఫొగట్ అధిక బరువు కారణంతో ఒలింపిక్స్ ఫైనల్‌లో ఆడకపోయినా ఆమె ఛాంపియనేనని హరియాణా సీఎం నయాబ్ సైనీ కొనియాడారు. ఆమెను చూసి గర్విస్తున్నామన్నారు. ఒలింపిక్ మెడలిస్ట్ మాదిరిగానే ఆమెకు స్వాగతం పలకాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు Xలో తెలిపారు. ఒలింపిక్ రజత పతక విజేతకు దక్కే అన్ని సన్మానాలు, రివార్డులు, సౌకర్యాలను వినేశ్‌కు అందిస్తామని ప్రకటించారు.

Similar News

News September 9, 2024

ట్రిలియనీర్లుగా మారనున్న మస్క్, అదానీ!

image

ప్రపంచ కుబేరుడిగా పేరు తెచ్చుకున్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 2027నాటికి ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా మారుతారని ఓ నివేదికలో వెల్లడైంది. ట్రిలియన్ డాలర్ అంటే సుమారు రూ. 83 లక్షల కోట్లు. మస్క్ సంపద సగటున 110 శాతం చొప్పున పెరుగుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద వార్షికంగా 123% వృద్ధి చెందితే ఆయన 2028నాటికి ట్రిలియనీర్‌గా మారుతారని అంచనా. కాగా మార్క్ జుకర్‌బర్గ్‌కు మరో రెండేళ్లు పట్టొచ్చు.

News September 9, 2024

ఎంపాక్స్‌పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

image

దేశంలో తొలిసారి ఎంపాక్స్‌ అనుమానితుడిని గుర్తించడంతో కేంద్రం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. ఎంపాక్స్‌పై ప్ర‌జ‌ల్లో అన‌వ‌స‌ర భ‌యాలు లేకుండా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదేశించింది. జిల్లాల్లో ప్ర‌జారోగ్య సౌక‌ర్యాల స్థాయిపై స‌మీక్షించాల‌ని, అనుమానితుల గుర్తింపు-ఐసోలేష‌న్ ఏర్పాట్లపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. కేసులు నమోదు కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.

News September 9, 2024

పారాలింపియన్ల అంకితభావం స్ఫూర్తిదాయకం: జగన్

image

పారిస్‌ పారాలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లకు, పతక విజేతలకు వైసీపీ చీఫ్ జగన్ అభినందనలు తెలిపారు. పారాలింపియన్ల అంకితభావం, ప్రతిభ అద్భుతమని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వారిని చూసి దేశం గర్విస్తోందన్నారు. తాజాగా ముగిసిన పారాలింపిక్స్‌లో భారత్ 29(గోల్డ్ 7, సిల్వర్ 9, బ్రాంజ్ 13) పతకాలు సాధించిన విషయం తెలిసిందే.