News February 15, 2025
మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం: సీఎం

AP: రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై CM చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరులో మాట్లాడుతూ ‘ఇటీవలే గుర్రంకొండలో యువతిని ఒకడు పొడిచేశాడు. పైగా ఇద్దరూ కలిసి విషం తాగినట్లు డ్రామా చేశాడు. మొన్న గుంటూరులో ఒకడు ఇద్దరిపై అత్యాచారం చేసి జైలుకెళ్లాడు. బయటికొచ్చి మళ్లీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంకోచోట ఆరేళ్ల బాలికను 75ఏళ్ల వృద్ధుడు రేప్ చేశాడు. ఈ మానవ మృగాలను కఠినంగా శిక్షిస్తాం’ అని హెచ్చరించారు.
Similar News
News March 27, 2025
స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు

TG: SC, ST, BC, మైనారిటీ, EBC విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును మే 31 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. 11.88 లక్షల మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 10.34 లక్షల మంది అప్లై చేసుకున్నారని తెలిపారు. MBBS, PG మెడికల్ ప్రవేశాలు పూర్తి కాకపోవడం, ఇంకా విద్యార్థుల వివరాలు అందకపోవడంతో గడువును పొడిగించారు. అటు కాలేజీల యాజమాన్యాల రిజిస్ట్రేషన్‌కూ మే 31 వరకు గడువు ఇచ్చారు.
News March 27, 2025
మీ ఫోన్‌పే, గూగుల్‌పే పని చేస్తున్నాయా?

నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్స్ పనిచేయలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) ప్రకటించింది. అయినా కొందరు తమ సమస్య అలాగే ఉందని SMలో పోస్టులు పెట్టారు. మరి మీ యూపీఐ పేమెంట్స్ పనిచేస్తున్నాయా? కామెంట్ చేయండి.
News March 27, 2025
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్

AP: చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు 200 యూనిట్ల చొప్పున ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించనుంది. అలాగే పవర్ లూమ్‌లకు 500 యూనిట్ల చొప్పున సరఫరా చేయనుంది. ఇందుకు సంబంధించి తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ పథకం ద్వారా 93,000 చేనేత కుటుంబాలతో పాటు 10,534 పవర్ లూమ్ యూనిట్లకు ప్రయోజనం చేకూరనుంది. ఒకవేళ పరిమితికి మించి విద్యుత్‌ను వాడితే అదనపు యూనిట్లకు మాత్రమే వినియోగదారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.