News April 15, 2025
భూమనపై కేసులు నమోదు చేస్తాం: హోంమంత్రి అనిత

AP: వైసీపీ నేతలు మతకలహాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. అబద్ధాల్ని నిజం చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పింక్ డైమండ్ ఉందంటూ దుష్ప్రచారం చేశారని గుర్తుచేశారు. టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెడతామని హోంమంత్రి స్పష్టం చేశారు.
Similar News
News April 23, 2025
ఇవాళే పోలింగ్

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల MLC ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనుంది. ఉ.8 నుంచి సా.4 వరకు ఓటింగ్ కొనసాగనుంది. 81మంది కార్పొరేటర్లు, 31మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికలో MIM నుంచి మీర్జా రియాజ్, BJP నుంచి గౌతంరావు పోటీలో ఉన్నారు. MIMకు 50, BJPకి 24, BRSకు 24, INCకి 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీకి దూరంగా ఉన్న INC, BRS ఓట్లు ఎవరికి వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. ఎల్లుండి కౌంటింగ్ జరుగుతుంది.
News April 23, 2025
నేడే టెన్త్ ఫలితాలు.. ఇలా చేయండి

AP: ఇవాళ టెన్త్ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.10 గంటలకు విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఓపెన్ స్కూల్ ఇంటర్ ఫలితాలను కూడా రిలీజ్ చేస్తారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు 6.19 లక్షల మంది హాజరయ్యారు. Way2News యాప్ ద్వారా సులభంగా ఫలితాలు తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే క్షణాల్లో మార్కుల లిస్ట్ వస్తుంది.
News April 23, 2025
రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ

కాళేశ్వరం కమిషన్ రెండోదశ విచారణ రేపటినుంచి ప్రారంభంకానుంది. ఈ సారి దర్యాప్తులో భాగంగా గత ప్రభుత్వంలోని బాధ్యులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెలతో కమిషన్ గడువు ముగియనున్న నేపథ్యంలో మరో రెండు మాసాలు గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటైంది.