News October 5, 2025
PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తాం: మంత్రి సత్యకుమార్

AP: PHC వైద్యుల డిమాండ్లు పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. SEP 28 నుంచి చేస్తున్న ఆందోళన విరమించి విధుల్లో చేరాలని కోరారు. శనివారం రాత్రి వైద్యారోగ్య అధికారులతో అత్యవసర సమావేశమైన ఆయన మాట్లాడారు. వైద్యుల డిమాండ్లపై CMతో చర్చిస్తానన్నారు. టైం బౌండ్ పదోన్నతులు, ట్రైబల్ అలవెన్స్, నోషనల్ ఇంక్రిమెంట్లు తదితరాలపై చర్చించి, ప్రభుత్వానికి సిఫారసులు చేసేందుకు ఇప్పటికే కమిటీ వేశామని చెప్పారు.
Similar News
News October 5, 2025
పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
News October 5, 2025
హైదరాబాద్‌లో వర్షం

TG: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఖైరతాబాద్, లక్డీకపూల్, నాంపల్లి, సెక్రటేరియట్, ట్యాంక్‌బండ్, లోయర్ ట్యాంక్‌బండ్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, SR నగర్, ఫిలింనగర్, కుత్బుల్లాపూర్ సహా మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సిటీలోని మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో వాన కురిసే అవకాశముందని ఇప్పటికే HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
News October 5, 2025
వన్డేల్లో కొనసాగడం ఇష్టం లేదా?

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ జట్టులో ఉంటారా అనే దానిపై సందేహాలు తలెత్తుతున్నాయి. వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాలని BCCI చెబుతూనే ఉంది. రోహిత్, కోహ్లీ రంజీల్లో అడపాదడపా ఆడి తప్పుకున్నారు. మళ్లీ తిరిగి దేశవాళీ మ్యాచుల్లో ఆడతామన్న సంకేతాలివ్వట్లేదు. ఈ నేపథ్యంలోనే వారికి వన్డేల్లోనూ కొనసాగేందుకు ఆసక్తి లేదేమోనని సెలక్టర్లు భావిస్తున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.