News August 7, 2024
చేనేత రంగంలో సబ్సిడీలు పునరుద్ధరిస్తాం: సీఎం చంద్రబాబు
AP: ప్రభుత్వపరంగా చేనేత రంగానికి అండగా నిలిచి నేతన్నలకు భరోసా ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘సమగ్ర చేనేత విధానం తీసుకువస్తాం. సబ్సిడీలు పునరుద్ధరించి చేనేత కుటుంబాలను, చేనేత రంగాన్ని నిలబెడతాం. అద్భుతమైన నేత కళను ప్రపంచానికి అందించిన చేనేత కార్మికులు మన దేశ ప్రతిష్ఠను పెంచారు. ఈ రంగానికి పునర్వైభవం తీసుకువస్తాం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2024
నేటి ముఖ్యాంశాలు
* TG: ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం పూర్తి
* ప్రజా ప్రభుత్వం రావడంతో ప్రజా పాలన దినోత్సవం: రేవంత్
* బలిదానాలతోనే తెలంగాణకు స్వాతంత్ర్యం: కిషన్‌రెడ్డి
* ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహం: KTR
* AP: వరద బాధితుల ఆర్థిక సాయం వివరాలు ప్రకటించిన ఏపీ సీఎం
* బోట్లను వదిలిన వారిని విడిచిపెట్టం: మంత్రి అనిత
* ఢిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా.. త్వరలోనే ఆతిశీకి బాధ్యతలు
News September 18, 2024
వరద బాధితుల రుణాల రీషెడ్యూలింగ్‌కు అవకాశం
AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏడాది పాటు మారిటోరియం కల్పించాయని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ జే.నివాస్ తెలిపారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలు రూ.50 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారు రూ.25వేలు వినియోగ రుణాలు పొందొచ్చన్నారు. పంట రుణాలు, ఆటో, బైక్స్, కిరాణా షాపులు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకూ రుణాల మారిటోరియంతో పాటు అవసరం మేరకు కొత్త రుణాలు పొందొచ్చన్నారు.
News September 18, 2024
చైనా పౌరుడికి బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉంటూ అంతర్జాతీయ క్రైం రాకెట్ నడుపుతున్న చైనా పౌరుడికి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. రెన్ చావోపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవని, బెయిల్ పిటిషన్‌ను పరిగణించబోమని స్పష్టం చేసింది. నేరపూరిత కుట్ర ఆరోపణలపై రెన్ చావోను నోయిడా పోలీసులు 2022లో అరెస్టు చేశారు. వ్యాపారం చేసే విదేశీయులు భారత చట్టాలకు లోబడి ఉండాలని అలహాబాద్ హైకోర్టు గతంలో అతని బెయిల్ తిరస్కరించింది.