News March 28, 2024

బలంగా తిరిగొస్తాం: తిలక్ వర్మ

image

మళ్లీ పుంజుకుని ఐపీఎల్‌లో రాణిస్తామని ముంబై ఇండియన్స్ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ తెలిపారు. ‘ఇది మేము కోరుకున్న రిజల్ట్ కాదు. మేము బలంగా తిరిగొస్తాం. నా వెంట ఉంటూ ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు, కోచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తిలక్ ట్వీట్ చేశారు. దీనికి ఉప్పల్ స్టేడియంలో తల్లిదండ్రులతో దిగిన ఫొటోను జతచేశారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో తిలక్ 34 బంతుల్లోనే 64 రన్స్ చేశారు.

Similar News

News April 16, 2026

జగన్.. ఇదేం రాక్షస మనస్తత్వం: లోకేశ్

image

AP: YCP చీఫ్ జగన్‌పై మంత్రి లోకేశ్ X వేదికగా విరుచుకుపడ్డారు. ‘తల్లిని, చెల్లిని తరిమేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రప్పా.. రప్పా నరుకుతాం. అమరావతిని మార్చేస్తాం. కట్టినవన్నీ కూల్చేస్తాం అంటారు. ఎందుకీ దుర్మార్గం? అధునాతన బోట్ల తయారీ కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానంటారా. ఇదేం రాక్షసమనస్తత్వం? వెయ్యికిపైగా ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవడం సైకోయిజమే’ అని దుయ్యబట్టారు.

News April 16, 2026

చడ్ఢాకు ‘Z’ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

image

ఆప్ ఎంపీ రాఘవ్ చడ్ఢాకు కేంద్రం ‘Z’ కేటగిరీ భద్రతను కల్పించింది. పంజాబ్ ఎంపీగా ఉన్న ఆయనకు ప్రాణాపాయ ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు ధ్రువీకరించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ ప్రభుత్వం ఆయనకు ఉన్న Z+ భద్రతను ఉపసంహరించుకున్న మరుసటి రోజే కేంద్రం రంగంలోకి దిగడం గమనార్హం. తాజా ఉత్తర్వుల ప్రకారం చడ్ఢాకు ఇకపై 22 మంది CRPF కమాండోలతో కట్టుదిట్టమైన రక్షణ ఉండనుంది.

News April 16, 2026

కరుడుగట్టిన పాక్ ఉగ్రవాది హమ్జాపై కాల్పులు!

image

పాక్‌లోని లాహోర్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో లష్కరే తోయిబా వ్యవస్థాపక సభ్యుడు, కరుడుగట్టిన ఉగ్రవాది అమీర్ హమ్జా తీవ్రంగా గాయపడ్డాడు. ఓ న్యూస్ ఛానల్ ఆఫీస్ బయట ఈ అటాక్ జరిగినట్లు సమాచారం. హమ్జాను వెంటనే ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హఫీజ్ సయీద్‌తో కలిసి లష్కరేను స్థాపించిన హమ్జా.. భారత్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా ఉన్నాడు.