News August 4, 2024
100 రోజుల్లో అన్నీ సెట్ చేస్తాం: సీఎం చంద్రబాబు

AP: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పరిస్థితి అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో అన్నీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. ‘రికార్డులన్నీ తారుమారు చేశారు. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతాను. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News November 14, 2025
పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్లాన్ ఫెయిల్.. డిపాజిట్లు గల్లంతు

పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్‌కు మంచి పేరుంది. ఎన్నికలు ఏవైనా ఆయన ప్లాన్ చేస్తే ఆ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే టాక్ ఉండేది. అయితే ఆ వ్యూహాలు తాను స్థాపించిన జన్ సురాజ్ పార్టీని అధికార పీఠం దగ్గరకు కూడా తీసుకొని వెళ్లలేకపోయాయి. బిహార్ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మొత్తం 239 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2% ఓటు షేర్ మాత్రమే జన్ సురాజ్‌కు దక్కింది.
News November 14, 2025
తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే?

జుట్టు నల్లగా ఉండటానికి కారణమయ్యే మెలనోసైట్లు తగ్గటానికి విటమిన్ డి లోపం, మానసిక ఒత్తిడి, సిగరెట్లు తాగటం, ఇతరులు కాల్చిన సిగరెట్ల పొగ పీల్చటం, వాయు కాలుష్యం, నిద్రలేమి, షిఫ్ట్ ఉద్యోగాలు వంటివి కారణమవుతాయంటున్నారు నిపుణులు. రాత్రిపూట కంటి నిండా నిద్రపోతే మెలటోనిన్ బాగా తయారవుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు తెల్లబడటాన్ని ఆపొచ్చు. మరీ అవసరమైతే వైద్యుల సూచనతో సప్లిమెంట్లు వాడొచ్చు.
News November 14, 2025
BRS ఓటమి.. కవిత సంచలన ట్వీట్

TG: జూబ్లీహిల్స్‌లో BRS ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు. దీంతో ‘కవితక్కతో ఏమీ కాదు అని హేళన చేసిన వారికి ఈ ఫలితం చెంపపెట్టు’ అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల BRS నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.


