News August 4, 2024
100 రోజుల్లో అన్నీ సెట్ చేస్తాం: సీఎం చంద్రబాబు
AP: గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పరిస్థితి అతలాకుతలమైందని సీఎం చంద్రబాబు మీడియా చిట్‌చాట్‌లో వ్యాఖ్యానించారు. 100 రోజుల్లో అన్నీ గాడిలో పెడతామని హామీ ఇచ్చారు. ‘రికార్డులన్నీ తారుమారు చేశారు. రెవెన్యూ శాఖపై ప్రత్యేక దృష్టి పెడతాను. రీ సర్వే అస్తవ్యస్తంగా జరగడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News September 11, 2024
ఇండియా-ఎ జట్టులోకి తెలుగు కుర్రాడు
ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా-ఎ జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. రేపు అనంతపురంలో ఇండియా-డితో జరగబోయే మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా రషీద్ గతంలో ఇండియా అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్నారు.
News September 11, 2024
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్: ఏది బెటర్?
చాలామంది వైట్ ఎగ్ కన్నా బ్రౌన్ ఎగ్‌లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. ధర ఎక్కువైనా వాటినే కొంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని పరిశోధకులు తేల్చారు. పెంకు రంగులోనే తేడా ఉంటుందని, రెండు గుడ్లలోనూ సమాన పోషకాలు ఉంటాయన్నారు. పెంకు రంగు మారటం వల్ల రుచి, నాణ్యతలో ఎలాంటి తేడా ఉండదు. బ్రౌన్ ఎగ్ పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. వాటిని పెంచేందుకు ఖర్చు ఎక్కువ కావటంతో ఆ గుడ్లను అధిక ధరకు విక్రయిస్తారు.
News September 11, 2024
వారికి రూ.25,000 సాయం!
AP: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. బాగా నీటమునిగిన ఇళ్లకు రూ.25వేలు, కొంతవరకు మునిగిన ఇళ్లకు రూ.10వేల సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. ఆటోలు, ట్యాక్సీల రిపేర్లకు రూ.10వేలు, బైకులకు రూ.3వేల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. పంటలకు గతంలో ఇస్తున్న పరిహారాన్ని పెంచి ఇవ్వనున్నట్లు సమాచారం. అటు కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయంపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.