News September 12, 2024

రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం: కౌశిక్

image

TG: తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేదు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే భయపడేటోడు ఎవడూ లేడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు.

Similar News

News February 19, 2026

కాపర్ టీ వాడుతున్నారా?

image

అవాంఛిత గర్భధారణను నివారించడానికి చాలామంది మహిళలు కాపర్ టీ వాడతారు. అయితే దీన్ని సరిగ్గా ప్లేస్ చేయకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కలయిక సమయంలో నొప్పి, రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు, కొన్నిసార్లు గర్భాశయ లైనింగ్‌ గాయపడటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో దాన్ని తొలగించుకోవాలని సూచిస్తున్నారు.

News February 19, 2026

Coffin Homes: 16 స్క్వేర్ ఫీట్ రూమ్.. అద్దె ₹40 వేలు!

image

ఎత్తైన బిల్డింగులు ఉండే హాంకాంగ్‌లో పేదరికం ఊపిరి ఆడనీయడం లేదు. ఆకాశాన్నంటే అద్దెలు చెల్లించలేక సుమారు 2 లక్షల మంది ప్రజలు కేవలం 16 చ.అ ‘కఫిన్ హోమ్స్’లో బతుకులీడుస్తున్నారు. వీటికి నెలకు ₹20-40 వేల అద్దె. కనీసం కాళ్లు చాచుకోవడానికి, నిలబడడానికి కూడా వీలులేని ఈ ఇరుకు గదుల్లోనే వంట, టాయిలెట్ అన్నీ. ఒకే అంతస్తును రెండుగా మార్చి, ప్లైవుడ్‌తో విభజించి ఇలాంటి రూమ్‌లను తయారు చేస్తున్నారు.

News February 19, 2026

‘పెద్ది’ విడుదలకు ముందే ₹150 కోట్ల బిజినెస్?

image

రామ్ చరణ్, బుచ్చిబాబు క్రేజీ కాంబోలో వస్తున్న‘పెద్ది’ నాన్-థియేట్రికల్ బిజినెస్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఏకంగా ₹130 కోట్లకు కైవసం చేసుకున్నట్లు సమాచారం. ఆడియో హక్కులు మరో ₹18 కోట్లు పలికినట్లు టాక్. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులతో కలిపి రిలీజ్‌కు ముందే ₹150 కోట్లకు పైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.