News September 12, 2024
రేపు తెలంగాణ పవర్ చూపిస్తాం: కౌశిక్
TG: తన ఇంటిపై అరెకపూడి గాంధీ అనుచరులు దాడి చేయడంపై నాన్ లోకల్ అంశాన్ని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి తెరపైకి తెచ్చారు. ‘మీకు దమ్ము లేదు. ఇంత మంది వచ్చి కూడా నా వెంట్రుక పీకలేదు. తెలంగాణ బిడ్డలం. బతకడానికి వచ్చిన ఆంధ్రోళ్లు దాడి చేస్తే భయపడేటోడు ఎవడూ లేడు. రేపు తెలంగాణ పవర్ ఏంటో చూపిస్తాం’ అని హెచ్చరించారు.
Similar News
News October 9, 2024
FLASH: న్యూజిలాండ్‌కు బ్యాడ్ న్యూస్
ఇండియాతో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ముంగిట న్యూజిలాండ్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అక్టోబర్ 16న బెంగళూరులో మొదలయ్యే టెస్టుకు కేన్ విలియమ్సన్ అందుబాటులో ఉండట్లేదని ఆ జట్టు సెలక్టర్లు ప్రకటించారు. శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో అతడు అసౌకర్యానికి గురయ్యారు. కేన్ లేకపోవడం న్యూజిలాండ్ బ్యాటింగ్ విభాగానికి పెద్దలోటే.
News October 9, 2024
నేడు కొత్త టీచర్లకు నియామక పత్రాలు
TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ఆయా జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో వీరిని హైదరాబాద్ తీసుకురానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంపికైన టీచర్లకు దసరా సెలవులు ముగిసే లోపే పోస్టింగులు ఇచ్చేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు.
News October 9, 2024
స్థానిక సంస్థలకు రూ.287 కోట్లు విడుదల
AP: గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.287.12 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వ పాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధులను కేటాయిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ జీవో ఇచ్చారు. ఇటు PM జన్‌మన్ పథకం కింద 332 గిరిజన గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల ఏర్పాటుకు రూ.29.93 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.