News September 17, 2024
‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తాం: సీఎం
AP: విజయవాడలో మళ్లీ వరదలు రాకుండా ‘ఆపరేషన్ బుడమేరు’ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బుడమేరు వాగుపై అక్రమ కట్టడాలను క్లియర్ చేస్తే 95% సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి చట్టం తీసుకొస్తామని చెప్పారు.
Similar News
News October 10, 2024
రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు, రాహుల్ సంతాపం
దిగ్గజ వ్యాపార వేత్త రతన్ టాటా మృతి పట్ల కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, అమిత్ షా, పియూష్ గోయల్ సంతాపం తెలియజేశారు. ఇండియా ఇండస్ట్రీకి రతన్ టాటా టైటాన్ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. టాటా నిజమైన దేశభక్తుడని అమిత్ షా పేర్కొన్నారు. పరిశ్రమలకు రతన్ చేసిన కృషి మన దేశంతో పాటు ప్రపంచంపై చెరగని ముద్ర వేసిందని నడ్డా తెలిపారు. రతన్ కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి రాహుల్ గాంధీ సంతాపం తెలియజేశారు.
News October 10, 2024
ప్రిడేటర్ డ్రోన్స్, అణు సబ్‌మెరైన్ల కొనుగోలుకు సీసీఎస్ ఆమోదం
రెండు అణు జలాంతర్గాముల నిర్మాణంతో పాటు 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు PM మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ(CCS) ఆమోదం తెలిపింది. సబ్‌మెరైన్లను రూ.40వేల కోట్లతో వైజాగ్‌లో నిర్మించనున్నారు. USకు చెందిన జనరల్ అటామిక్స్ సంస్థ నుంచి డ్రోన్లను కొనుగోలు చేస్తారు. ఇవి వచ్చే నాలుగేళ్లలో దశలవారీగా భారత్ చేతికి అందుతాయి. అందులో నేవీకి 15, ఆర్మీ, వాయుసేనకు చెరో 8 డ్రోన్లు కేటాయించారు.
News October 10, 2024
అక్టోబర్ 10: చరిత్రలో ఈ రోజు
1906: రచయిత R.K.నారాయణ్ జననం
1967: హాస్య నటుడు ఆలీ జననం
1973: దర్శకుడు రాజమౌళి జననం
1990: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జననం
2022: సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణం
✶ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం