News February 10, 2025
అక్రమ వలసలను అడ్డుకుంటాం: యూకే ప్రధాని

అక్రమ వలసదారులపై యునైటెడ్ కింగ్‌డమ్ ఉక్కుపాదం మోపబోతుంది. తమ దేశంలోకి చాలామంది విదేశీయులు అక్రమంగా చొరబడి వివిధ పనులు చేస్తున్నారని, త్వరలోనే వారిపై కఠిన చర్యలుంటాయని ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే అక్రమ వలసదారులను అమెరికా తిరిగి వారికి దేశాలకు పంపిస్తుండగా, ప్రస్తుతం యూకే సైతం అక్రమ వలసలకు అడ్డుకట్ట వేసేందుకు సన్నద్ధమవుతుండడం చర్చనీయాంశంగా మారింది.
Similar News
News March 15, 2025
గ్రూప్-3లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికంటే?

TG: నిన్న వెలువడిన గ్రూప్-3 ఫలితాల్లో మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన అర్జున్ 339.239 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈయన గ్రూప్-2లో స్టేట్ 18వ ర్యాంక్ సాధించడం గమనార్హం. మొత్తం 2,67,921 మంది పరీక్షలు రాయగా 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్టులను రిలీజ్ చేశారు. టాప్-10లో ఒక్కరు మాత్రమే అమ్మాయి ఉండటం గమనార్హం. మొత్తంగా టాప్-100లో 12 మంది అమ్మాయిలు ఉన్నారు.
News March 15, 2025
ALERT.. రెండు రోజులు జాగ్రత్త

AP: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటాయి. కర్నూలులో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తుని, కావలి, నంద్యాల, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ, రేపు రాయలసీమ, కోస్తాంధ్రలో పలు ప్రాంతాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
News March 15, 2025
అంతరిక్ష ప్రయోగాల ద్వారా ఇస్రోకి రూ 1,243 కోట్ల ఆదాయం

విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో రూ.1,243కోట్లు ఆర్జించినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. భారత్ పంపిన ఉపగ్రహాల్లో అత్యధికంగా అమెరికా(232), ఇంగ్లండ్(83), సింగపూర్(19) దేశాలకు చెందినవి ఉన్నాయి. మెుత్తంగా 393 విదేశీ ఉపగ్రహాలు, 3కస్టమర్ ఉపగ్రహాలను ప్రయోగించినట్లు తెలిపారు. ప్రస్తుతం 61దేశాలు, 5బహుళజాతి సంస్థలతో ఇస్రో ఒప్పందాలు చేసుకుంది.