News April 25, 2024
అధికారంలోకి రాగానే అతడిని ఆదుకుంటాం: నారా లోకేశ్

AP: సీఎం జగన్‌పై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. తప్పుడు కేసు ఎదుర్కొంటున్న సతీశ్‌ను, అతని కుటుంబాన్ని అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ట్వీట్ చేశారు. ఈ కేసును ఎత్తివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారందరినీ ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
Similar News
News March 25, 2026
వరకట్న వేధింపులకు 1,304 మంది బలి

AP, TGలో గత 5ఏళ్లలో 1,304 మంది మహిళలు వరకట్న వేధింపులతో మరణించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. TDP MP బైరెడ్డి శబరి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. 2019 నుంచి 2023 వరకు APలో 526, TGలో 778 కేసులు నమోదయ్యాయి. శిక్షల ఖరారు రేటు APలో 11.5%, TGలో 14.4%గా ఉంది. వరకట్న మరణాల్లో UP, బిహార్ టాప్‌లో ఉన్నాయి. 2023లో దేశవ్యాప్తంగా 6,156 మంది కట్నం వేధింపులతో చనిపోయారు.
News March 25, 2026
పశ్చిమాసియా యుద్ధంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

US-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంపై నటుడు ప్రకాశ్ రాజ్ సెటైర్ వేశారు. ‘యుద్ధం లక్ష్యం ఇప్పుడు “హార్ముజ్” జలసంధిని తెరవడం వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. నిజానికి యుద్ధం మొదలవ్వకముందు అది తెరిచే ఉంది’ అని లాఫింగ్ ఎమోజీతో ఆయన ట్వీట్ చేశారు. కాగా తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని ఇరాన్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
News March 25, 2026
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ శుభవార్త

ప్రపంచ ఇంధన రవాణాకు ఆయువుపట్టు అయిన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది. తమతో శత్రుత్వం లేని దేశాల నౌకలు హార్ముజ్ నుంచి రాకపోకలు కొనసాగించవచ్చని UN సెక్యూరిటీ కౌన్సిల్, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్‌కు తెలిపింది. నౌకల భద్రతపై తమ దేశ అధికారులతో సమన్వయం చేసుకుంటూ జలసంధిని దాటవచ్చని పేర్కొంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్‌తో పాటు వాటికి సపోర్ట్ చేసే దేశాలకు పర్మిషన్ లేదని స్పష్టం చేసింది.


