News April 25, 2024

అధికారంలోకి రాగానే అతడిని ఆదుకుంటాం: నారా లోకేశ్

image

AP: సీఎం జగన్‌పై దాడి ఘటనలో నిందితుడిగా ఉన్న వేముల సతీశ్‌ను పోలీస్ కస్టడీకి ఇవ్వడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. తప్పుడు కేసు ఎదుర్కొంటున్న సతీశ్‌ను, అతని కుటుంబాన్ని అధికారంలోకి రాగానే ఆదుకుంటామని ట్వీట్ చేశారు. ఈ కేసును ఎత్తివేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారందరినీ ఆదుకునే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

Similar News

News December 16, 2025

ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలపై సభాసంఘం

image

AP: ఆప్కాబ్, DCCB, PACSలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై స్పీకర్ ఏడుగురు MLAలతో సభాసంఘాన్ని నియమించారు. ఇందులో N.అమర్‌నాథ్ రెడ్డి ఛైర్మన్‌గా K.రవికుమార్, D.నరేంద్ర, B.శ్రీనివాస్, Y.వెంకట్రావు, B.రామాంజనేయులు, శ్రావణ్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై ఫిర్యాదులను అసెంబ్లీ సహాయ కార్యదర్శికి నేరుగా లేదా ‘apl.apcob@gmail.com’కి మెయిల్ పంపవచ్చని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ తెలిపారు.

News December 16, 2025

CLAT-2026 ఫలితాలు విడుదల

image

దేశవ్యాప్తంగా న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT)-2026 ఫలితాలు విడుదలయ్యాయి. <>https://result1.consortiumofnlus.ac.in/<<>>లో రిజల్ట్స్ చూసుకోవచ్చు. కాగా డిసెంబర్ 7న జరిగిన పరీక్షకు దాదాపు 92వేల మంది హాజరయ్యారు. ఎంపికైన వారికి నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలలో UG, PG ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు.

News December 16, 2025

కోడి గీతలతో YCP కోటి సంతకాల డ్రామా: సత్యకుమార్

image

AP: మెడికల్ కాలేజీల విషయంలో ప్రజా మద్దతు లేక YCP చీఫ్ జగన్ కోడి గీతలతో కోటి సంతకాల డ్రామా ఆడుతున్నారని మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. ప్రజారోగ్యం, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా 10 వైద్య కళాశాలలను PPP విధానంలో నడపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జగన్ దాన్ని ప్రైవేటీకరణగా వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రం, కోర్టులు PPPని సమర్థించాయని, దీనిపై ఆయన కోర్టుకెళ్తేనే మేలని చెప్పారు.