News May 3, 2024
25 ఎంపీ స్థానాలూ గెలుస్తాం: చంద్రబాబు
AP: వచ్చే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను గెలుస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆయన నెల్లూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభలో మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికలు విధ్వంసం- అభివృద్ధి, ధర్మం-అధర్మం మధ్య జరుగుతున్నాయి. రాతియుగం పోవాలి.. స్వర్ణ యుగం రావాలి. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి అధికారంలోకి రావాలి’ అని చెప్పారు.
Similar News
News November 9, 2024
అవును.. కెనడాలో ఖలిస్థానీలున్నారు: ట్రూడో
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులున్నట్లు ఆ దేశ PM జస్టిన్ ట్రూడో అంగీకరించారు. అయితే తమ దేశంలోని సిక్కులందరికీ వారు ప్రతినిధులు కారని స్పష్టం చేశారు. మోదీని అభిమానించే హిందువులూ తమ దేశంలో ఉన్నారని, వారు కూడా మొత్తం హిందువులకు ప్రతినిధులు కాదని అన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థానీలకు కెనడా స్వర్గధామంగా మారిందన్న భారత్ ఆరోపణలకి ట్రూడో వ్యాఖ్యలు బలాన్ని చేకూర్చాయి.
News November 9, 2024
వరుసగా 2 సెంచరీలు.. సంజూ రికార్డ్
సౌతాఫ్రికాతో తొలి T20లో సంజూ శాంసన్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. అంతకుముందు అతడు HYDలో బంగ్లాతో T20లోనూ సెంచరీ చేశారు. దీంతో టీ20ల్లో భారత్ తరఫున వరుసగా 2 సెంచరీలు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. ఓవరాల్‌గా ఈ ఫీట్ సాధించిన నాలుగో బ్యాటర్‌గా నిలిచారు. తొలి 3 స్థానాల్లో మెకియాన్, రొసోవ్, సాల్ట్ ఉన్నారు. ఇక T20ల్లో IND తరఫున 2 సెంచరీలు చేసిన తొలి వికెట్ కీపర్‌గానూ సంజూ రికార్డ్ నెలకొల్పారు.
News November 9, 2024
ట్రంప్‌పై హత్యకు ఇరాన్ వ్యక్తి ప్లాన్: అమెరికా
డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేసేందుకు ఇరాన్‌కు చెందిన షకేరీ అనే వ్యక్తి కుట్ర చేశాడని అమెరికా న్యాయ శాఖ తాజాగా ఆరోపించింది. ఇరాన్ ప్రభుత్వం తరఫున అతడు ఏజెంట్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. చిన్నప్పుడే అమెరికాకు వచ్చిన అతడిని 2008లో ఓ చోరీ కారణంగా ఇరాన్‌కు US పంపించేసిందని వివరించింది. ఈ ఏడాది అక్టోబరు 7న ట్రంప్‌ను హత్య చేసేందుకు కొంతమంది తనకు ప్లాన్ అందించారని అతడు తమకు చెప్పినట్లు స్పష్టం చేసింది.