News March 8, 2025
జీన్స్ ధరించండి.. మీ జీన్స్ మర్చిపోవద్దు: చిదానంద

AP: ధరించే దుస్తులు కాకుండా ఎలాంటి విలువలు పాటిస్తున్నామనేదే ముఖ్యమని పరమార్థ్ నికేతన్ ఆశ్రమ గురువు చిదానంద సరస్వతి చెప్పారు. మహాకుంభమేళాలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆధ్యాత్మికత వైపు వెళ్లాలంటే ధరించే వెళ్లాలంటే జీన్స్‌కు బదులు సంప్రదాయ దుస్తులు ధరించాలా? అని ఓ యువకుడు అడిగాడు. జీన్స్‌తో ఇబ్బంది లేదని, జన్యుమూలాల(జీన్స్)ను మర్చిపోవద్దని సూచించా’ అని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై చిరంజీవి అప్‌డేట్

తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘కళ్యాణ్ బాబుకు విజయవంతంగా <<19685329>>సర్జరీ<<>> జరిగింది. ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. కోలుకుంటున్నారు. సాధారణ స్థితికి వచ్చేందుకు వారం పడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన, ప్రేమ చూపించిన వారందరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
News April 19, 2026
ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
News April 19, 2026
KKRతో మ్యాచ్.. RR బ్యాటింగ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన RR కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, పరాగ్, హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, రవి బిష్ణోయ్
KKR: సీఫెర్ట్, రహానే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమణ్‌దీప్, అనుకుల్, వైభవ్ అరోరా, కార్తీక్, వరుణ్


