News March 24, 2024
జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక

AP: పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ఆకారంలో పెళ్లి పత్రికను ముద్రించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అడబాల నాగేశ్వరరావు పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ఆ శుభలేఖపై పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫొటోలను ప్రింట్ చేయించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News December 5, 2025
‘హిల్ట్’పై హైకోర్టులో విచారణ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు

TG: <<18450502>>హిల్ట్<<>> పాలసీపై పర్యావరణవేత్త పురుషోత్తం, ప్రజాశాంతి పార్టీ చీఫ్ KA పాల్ వేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. 9,292 ఎకరాల భూ కేటాయింపుల విషయంలో రూపొందించిన జీవో నిబంధనలకు విరుద్ధంగా ఉందని, దీనిపై సీబీఐ లేదా ఈడీతో విచారణ జరిపించాలని పిటిషనర్లు కోరారు. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.
News December 5, 2025
కూరగాయల పంటల్లో వైరస్ తెగుళ్లు ఎలా వ్యాపిస్తాయి?

కూరగాయల పంటలకు రసం పీల్చే పురుగుల ముప్పు ఎక్కువ. ఇవి వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తాయి. ఈ తెగుళ్లతో 25-75% వరకు పంట నష్టం జరుగుతుంది. వైరస్ సోకిన మొక్కలను రసం పీల్చే పురుగులు ఆశించి వాటి ఆకుల్లో రసం పీలిస్తే, వైరస్ కణాలు రసం ద్వారా పురుగుల శరీర భాగాల్లోకి ప్రవేశిస్తాయి. ఈ పురుగులు ఆరోగ్యంగా ఉన్న మొక్కల రసం పీల్చినప్పుడు పురుగుల నోటి భాగాల నుంచి వైరస్‌లు ఆరోగ్యంగా ఉన్న మొక్కలకు వ్యాపిస్తాయి.
News December 5, 2025
రాబోయే పది రోజులు తీవ్ర చలి!

TG: రాబోయే 10 రోజుల్లో రాష్ట్రంలో తీవ్ర చలి గాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి బలమైన చలి గాలులు ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్‌లో రేపటి నుంచి చలి పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.


