News March 24, 2024
జనసేన గ్లాసు గుర్తు ఆకారంలో పెళ్లి పత్రిక

AP: పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ ఆకారంలో పెళ్లి పత్రికను ముద్రించుకున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం మెట్టవలస గ్రామానికి చెందిన అడబాల నాగేశ్వరరావు పవన్‌పై తనకున్న అభిమానాన్ని ఇలా చాటుకున్నాడు. ఆ శుభలేఖపై పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫొటోలను ప్రింట్ చేయించాడు. దీంతో ఈ వెడ్డింగ్ కార్డు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Similar News
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.
News March 7, 2026
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్‌ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.
News March 7, 2026
REWIND: INS ఖుక్రీ.. 194 మంది వీరమరణం

ఇటీవల US దాడిలో ఇరాన్ నౌక ‘<<19299071>>దేనా<<>>’ మునిగిపోవడంతో 1971 నాటి INS ఖుక్రీ త్యాగం గుర్తుకొస్తోంది. నాటి యుద్ధంలో పాక్ జలాంతర్గామి ‘హంగోర్’ ప్రయోగించిన టార్పెడో నుంచి INS కిర్పాన్ తప్పించుకుంది. వెంటనే హంగోర్‌ను అడ్డుకునేందుకు ఖుక్రీ కదిలింది. అయితే అది వదిలిన రెండో టార్పెడో నేరుగా ఆయిల్ ట్యాంకులకు తగలడంతో భారీ పేలుడు సంభవించింది. కేవలం 2 నిమిషాల్లోనే నౌక సముద్రంలో మునిగి 194 మంది వీరమరణం పొందారు.


