News March 23, 2024

తిహార్‌కు స్వాగతం.. కేజ్రీవాల్‌కు సుకేశ్ లేఖ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌ను ఉద్దేశిస్తూ మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి లేఖ రాశారు. ‘తిహార్ క్లబ్‌కు బాస్‌గా మీకు స్వాగతం పలుకుతున్నా. ఖట్టర్ ఇమాందార్(నిజాయితీపరుడు) అనే డ్రామాలకు ముగింపు పడింది. కేజ్రీవాల్ అవినీతి మొత్తం బహిర్గతమవుతోంది. నిజమే గెలుస్తుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల కవితపై ఆరోపణలు చేస్తూ అతను లేఖ రాసిన విషయం తెలిసిందే.

Similar News

News September 15, 2024

రెండు రోజులు పోలీస్ కస్టడీకి నందిగం సురేశ్

image

AP: టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టయిన వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి ఈనెల 17న మధ్యాహ్నం వరకు ఆయనను పోలీసులు మంగళగిరి రూరల్ పీఎస్‌లో విచారించనున్నారు. విచారణ సందర్భంగా దూషించడం, భయపెట్టడం, లాఠీ ఛార్జ్ వంటివి చేయవద్దని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

News September 15, 2024

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్

image

TG: PMFBY కింద రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంటల బీమాను అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించి ఈ నెలాఖరు వరకు క్లస్టర్ల వారీగా టెండర్లను స్వీకరించనుంది. బీమా ప్రీమియంలో రైతుల వాటా కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం రూ.2,500కోట్ల నిధులు అవసరం అవుతాయని అంచనా వేస్తోంది. దాదాపు అన్ని పంటలకు బీమాను వర్తింపజేయనున్నట్లు సమాచారం. అయితే ఏ సీజన్ (ఖరీఫ్ORరబీ) నుంచి అమలు చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.

News September 15, 2024

మా ఆర్థిక కష్టాలు తాత్కాలికమే: మాల్దీవులు

image

తమ ఆర్థిక కష్టాలు తాత్కాలికమేనని మాల్దీవుల ఆర్థిక మంత్రి మూసా జమీర్ తాజాగా పేర్కొన్నారు. చైనాకు దగ్గరయ్యాక ఆ దేశం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) ప్యాకేజీకి మాల్దీవులు యత్నిస్తోందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తమ అవసరాలకు, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించే మిత్రదేశాలు తమకున్నాయని, IMF గురించి ఆలోచించడం లేదని మూసా స్పష్టం చేశారు.