News August 14, 2024

నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా!

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్, హెజ్బొల్లా, హమాస్‌లు ముప్పేట దాడి చేయనున్నట్లు ఆ దేశాన్ని అమెరికా అప్రమత్తం చేసింది. ఈ వారంలోనే దాడులు జరగొచ్చని వైట్ హౌస్ హెచ్చరించింది. కాగా రేపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరగనున్నాయి. దీంతో యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలు ఇరాన్‌ను బుజ్జగిస్తున్నారు. చర్చల వేళ దాడులు జరపొద్దని ఇరాన్ కొత్త అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

Similar News

News September 21, 2024

అమ్మో.. ఈ కార్లకు అంత ధరా..?

image

ఈ ఏడాది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో తొలి 2స్థానాలను రోల్స్ రాయిస్ దక్కించుకుంది. అగ్రస్థానంలో రోల్స్ రాయిస్ లా రోజ్ నోయిర్ డ్రాప్‌టెయిల్(ధర రూ.251 కోట్లకు పైమాటే), రెండో ప్లేస్‌లో బోట్ టెయిల్(రూ.234 కోట్లు), రూ.156 కోట్లతో బుగాటీ లా వోయిచర్ నోయిర్ 3వ స్థానంలో నిలిచాయి. పగానీ జోండా హెచ్‌పీ బార్చెటా(రూ.142 కోట్లు), ఎస్పీ ఆటోమోటివ్ చౌస్(రూ.120 కోట్లు) ఆ తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి.

News September 21, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: సెప్టెంబర్ 21, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:05 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:09 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:31 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:13 గంటలకు
✒ ఇష: రాత్రి 7.25 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 21, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.