News February 3, 2025
WGL: నేటి నుంచే నామినేషన్లు.. 27న పోలింగ్!
NLG – KMM – WGL టీచర్ MLC స్థానానికి అభ్యర్థుల నుంచి సోమవారం నామినేషన్లు స్వీకరించనున్నారు. NLG కలెక్టరేట్‌లో అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠికి అందజేయనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఈ నెల 27న ఉ. 8 నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 3న ఆర్జాలబావి వద్ద ఉన్నవేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Similar News
News February 3, 2025
AP: డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ ఎన్నికల అప్‌డేట్స్
☛ నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ వైస్ ఛైర్మన్‌గా టీడీపీ మద్దతు అభ్యర్థులు శివ కుమార్ రెడ్డి (9వ వార్డు), పటాన్ నస్రిన్ (8వ వార్డు) ఎన్నిక
☛ పిడుగురాళ్ల మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా.. సమావేశానికి హాజరుకాని వైసీపీ కౌన్సిలర్లు
☛ తిరుపతి డిప్యూటీ మేయర్, నందిగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా.. కోరం లేకపోవడంతో వాయిదా వేసిన అధికారులు
News February 3, 2025
వనపర్తి: సబ్సిడీ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం
అర్హులైన దివ్యాంగులకు ఆర్థిక పునరావాస పథకం కింద స్వయం ఉపాధి పొందేందుకు సబ్సిడీ రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి సుధారాణి తెలిపారు. 100% రాయితీతో రూ.50,000 చొప్పున 20 యూనిట్లు మంజూరు చేసిన్నారు. మంజూరు నిమిత్తం అర్హులైన దివ్యాంగులను tg obmms.cgg.gov.in వెబ్ సైట్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పోర్టల్‌ను సంప్రదించాలన్నారు.
News February 3, 2025
క్రీడలకు కేంద్రం ఎంత కేటాయించిందంటే?
2025-26 ఏడాదికి కేంద్రం బడ్జెట్ విడుదల చేయగా అందులో క్రీడా మంత్రిత్వ శాఖకు రూ.3,794.30 కోట్లు కేటాయించింది. దీనితో చైనా బడ్జెట్‌ను పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చైనా ప్రభుత్వం రూ.27,741 కోట్లు క్రీడల కోసమే కేటాయించింది. క్రీడాకారులకు సరైన వసతులు కల్పించేలా బడ్జెట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2024 ఒలింపిక్స్‌లో చైనాకు 91 మెడల్స్ వస్తే, ఇండియాకు 6 మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే.