News February 1, 2025
ఏమిటీ శ్లాబుల గజిబిజి

ఇకపై ₹12 లక్షల వరకు పన్ను లేదు.. ₹0-4L 0% పన్ను, ₹4L-8L 5% పన్ను అంటారేంటి అని తికమకపడ్డారా? ₹12L కంటే ఎక్కువ ఆదాయం ఉంటే మొత్తాన్ని శ్లాబులుగా విభజించి పన్ను లెక్కిస్తారు.
Ex: ₹20L (₹75k స్టాండర్డ్ డిడక్షన్): ₹19.25 లక్షలపై పన్ను (మీ 12L పైన ఆదాయాన్నీ ఇలా బ్రేక్ చేయండి)
₹0-4L: 0%
₹4L-8L: 5%= ₹20K
₹8L-12L: 10% = ₹40K
₹12L-16L : 15% = ₹60K
₹16L-20L (₹3.25L): 20% = ₹65K
(₹20L ఆదాయంపై పన్ను ₹1.85L)
Similar News
News February 16, 2025
మజ్లిస్ మా ప్రధాన శత్రువు: కిషన్ రెడ్డి

TG: మజ్లిస్ పార్టీ తమ ప్రధాన శత్రువని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘మజ్లిస్ పార్టీ చాప కింద నీరులా బలాన్ని పెంచుకుంటోంది. బీజేపీ శ్రేణులు జాగ్రత్త పడాలి. ఆ పార్టీ కోరల్ని పీకాలి. సీఎం రేవంత్ ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారారు. ఆయన మాటలు కోటలు దాటుతాయి తప్ప పనులు సచివాలయం కూడా దాటట్లేదు’ అని విమర్శించారు.
News February 16, 2025
చికెన్ మార్కెట్.. ఆదివారం ఆదుకునేనా?

చాలా ఇళ్లలో ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిదే ముద్ద దిగదు. అయితే బర్డ్ ఫ్లూ భయాందోళనలతో గత కొన్ని రోజులుగా చికెన్, గుడ్డు తినడాన్ని చాలామంది తగ్గించేశారు. ప్రమాదం లేదని ప్రభుత్వమే చెబుతున్నా ప్రజలు భయపడుతున్నారు. రేట్లు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. మరి ఆదివారమైనా ప్రజలు తిరిగి చికెన్ వైపు చూస్తారా లేక ఇతర నాన్ వెజ్ ఆప్షన్లను ఎంచుకుంటారా? చూడాలి.
News February 16, 2025
ఫ్యాన్స్కోసం మెగాస్టార్ కీలక నిర్ణయం?

గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు సిద్ధమవుతున్న ఆయన, వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి కాగా.. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు చెబుతున్నాయి.