News March 28, 2024
Ghost Jobs ఏంటి? ఎప్పుడైనా అప్లై చేశారా?

వినేందుకు వింతగా ఉన్న ఈ ఘోస్ట్ జాబ్స్ ఇటీవల ఎక్కువయ్యాయి. ఘోస్ట్ జాబ్స్ అంటే కంపెనీలు ఉద్యోగ ప్రకటనలు ఇచ్చినా నియమించుకునే ఉద్దేశం ఉండకపోవడం. కంపెనీ వెబ్‌సైట్లో ఖాళీలున్నట్లు చూపించినా బడ్జెట్, ఇతర కారణాలతో రిక్రూట్ చేసుకోదు. జాబ్ ప్రకటించిన డేట్ చెక్ చేయడం, కంపెనీ గురించి క్రాస్ చెక్, ఆ ఉద్యోగులను సోషల్ మీడియాలో కలవడం, నేరుగా కంపెనీకి వెళ్లడం వంటి స్టెప్స్ తీసుకుంటే వీటి నుంచి తప్పించుకోవచ్చు.
Similar News
News February 13, 2026
శివయ్య చేతిలో త్రిశూలం ఎందుకు?

శివుని చేతిలోని త్రిశూలం సత్వ, రజో, తమో గుణాలకు ప్రతీక. ఈ 3 శక్తులు ఆయన ఆధీనంలో ఉంటాయని, వాటిని సమన్వయం చేస్తూ ఆయన సృష్టిని నడిపిస్తారని అర్థం. అలాగే జ్ఞానం, ఇచ్చాశక్తి, క్రియాశక్తిని సూచిస్తుంది. భక్తుల హృదయాల్లోని అజ్ఞానాన్ని నశింపజేసి, పరిపూర్ణంగా ఆధ్యాత్మికత వైపు నడిపిస్తుంది. అంతటి శక్తి త్రిశూలానికి ఉంటుంది. ఇది మానవునిలోని అరిషడ్వర్గాలను జయించి, ముక్తిని పొందే మార్గాన్ని బోధిస్తుంది.
News February 13, 2026
కాసేపట్లో కౌంటింగ్.. మున్సి‘పల్స్’ పట్టేదెవరో?

TG: రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో కౌంటింగ్ ప్రక్రియ ఇవాళ ఉ.8 గంటలకు మొదలు కానుంది. 2,981 వార్డులకు 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారి భవితవ్యం సాయంత్రంలోగా తేలనుంది. 123 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. దీనికోసం అధికారులు అంతా సిద్ధం చేయగా ప్రతి గదిలోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. గెలిచిన అభ్యర్థులు ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేస్తారు.
News February 13, 2026
ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్ ఇస్తుందా?

T20 WCలో జింబాబ్వేపై రికార్డు ఆస్ట్రేలియాను కలవరపెడుతోంది. ఈ రెండు జట్లు 2007లో తలపడిన మ్యాచులో ZIMనే విజయం సాధించడం దీనికి కారణం. 19 ఏళ్ల తర్వాత ఇరు జట్లు ఇవాళ ఉ.11 గంటలకు తలపడనున్నాయి. ఈ టోర్నీలో AUS, జింబాబ్వే చెరో విజయంతో గ్రూప్-Bలో 2, 3 స్థానాల్లో ఉన్నాయి. మరి ఈ మ్యాచులో ఆస్ట్రేలియాకు ZIM మరోసారి షాక్ ఇస్తుందా? లేదా AUS ఆధిపత్యం కొనసాగిస్తుందో చూడాలి.


