News May 4, 2024
వ్యయ పరిమితి దాటితే చర్యలు ఎలా?

అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 15, 2025
పహల్గాం ఉగ్రదాడి.. నేడు ఎన్ఐఏ ఛార్జ్షీట్

పహల్గాం ఉగ్రదాడి ఘటనపై NIA ఇవాళ ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. జమ్మూలోని NIA ప్రత్యేక కోర్టు ముందు ఫైల్ చేయనుందని అధికారులు తెలిపారు. ఈ దాడికి కారుకులైన ముగ్గురు టెర్రరిస్టులను జులైలో భద్రతా దళాలు హతమార్చాయి. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన <<16780359>>ఉగ్రదాడి<<>>లో 26 మంది టూరిస్టులు చనిపోయారు. దీనికి ప్రతీకారంగా పాక్ ఉగ్ర శిబిరాలపై ‘<<16441544>>ఆపరేషన్ సిందూర్<<>>’ను భారత్ చేపట్టిన విషయం తెలిసిందే.
News December 15, 2025
కొత్త మేకప్ ట్రెండ్.. జంసూ

కొరియన్ అమ్మాయిలైనా, అబ్బాయిలైనా వాళ్ల ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. అందుకే చాలామంది కొరియన్ ట్రెండ్స్నే ఫాలో అవుతుంటారు. వాటిల్లో కొత్తగా వచ్చిందే జంసూ. ముందుగా ముఖానికి బేబీ పౌడర్ పూసుకుని, పెద్ద గిన్నెలో చల్లటి నీళ్లు వేసి, పౌడర్ రాసుకున్న ముఖాన్ని 30 సెకన్ల పాటు ఆ నీళ్లలో ఉంచుతారు. దీని వల్ల ముఖానికి వేసుకున్న మేకప్ ఎక్కువ సేపు ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ప్రయత్నించి చూడండి.
News December 15, 2025
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మృతి

ప్రఖ్యాత హాలీవుడ్ దర్శకుడు రాబ్ రైనర్ (78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్ (68) దారుణ హత్యకు గురయ్యారు. US లాస్ ఏంజెలిస్లోని వారి ఇంట్లో రక్తపుమడుగులో పడి కనిపించారు. సొంత కుమారుడే వారిని చంపారని అంతర్జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. నటుడిగా ఆయన రెండు ఎమ్మీ అవార్డులు గెలుచుకున్నారు. దర్శకుడిగా ‘When Harry Met Sally’, ‘Misery’, ‘A Few Good Men’ వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు.


