News May 4, 2024
వ్యయ పరిమితి దాటితే చర్యలు ఎలా?
అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 30 రోజులకు, లోక్‌సభ ఎన్నికలయితే 90 రోజుల్లోపు అభ్యర్థులు తమ వ్యయానికి సంబంధించిన ఆధారాలను ECకి అందించాలి. ఇలా చేయకపోతే ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10A కింద అభ్యర్థిపై మూడేళ్ల అనర్హత వేటు వేస్తుంది. పరిమితికి మించి ఖర్చుపై ఎవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేయొచ్చు. అది నిజమని తేలితే అవినీతి చర్యగా పరిగణించి అభ్యర్థిని మూడేళ్లు అనర్హుడిగా ఈసీ ప్రకటిస్తుంది.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 12, 2024
ఢిల్లీకి రేవంత్.. క్యాబినెట్ విస్తరణ ఉంటుందా?
TG: సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో క్యాబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ ఇది చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చర్చిస్తారని సమాచారం.
News November 12, 2024
అమెరికా NSAగా ఇండియా ఫ్రెండ్.. చైనాకు విరోధి!
భారత్ అనుకూల వ్యక్తులకు డొనాల్డ్ ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇండియా కాకస్ కోఛైర్మన్ మైక్ వాల్జ్‌ను NSAగా ఎంపిక చేశారని తెలిసింది. ఈ రిటైర్డ్ ఆర్మీ కల్నల్‌కు చైనా పొడ అస్సలు గిట్టదు. రిపబ్లికన్ చైనా టాస్క్‌ఫోర్స్‌లోనూ ఆయన సభ్యుడు. ఒకవేళ ఇండో పసిఫిక్ ప్రాంతంలో వివాదం ఏర్పడితే US మిలిటరీ సన్నద్ధంగా లేదని బాహాటంగానే చెప్పారు. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ఎక్కువ, అమెరికా తక్కువ సాయం చేయాలని సూచించారు.
News November 12, 2024
థాంక్స్ శివయ్య.. భక్తి చాటిన వానరం
TG: ఓ వానరం శివలింగం వద్ద చేసిన సందడి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. కార్తీకమాసం సందర్భంగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలోని శివలింగం వద్ద భక్తులు పూజలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన ప్రసాదాలు, అరటిపండ్లను వానరాలు ఆరగించాయి. వాటిల్లో ఓ కోతి శివలింగంపై తలపెట్టి వేడుకున్నట్లు కనిపించింది. ఆహారం ఇచ్చినందుకు థాంక్స్ చెప్పినట్లు ఆ దృశ్యం ఉందని అక్కడున్న వారు చర్చించుకున్నారు.