News March 6, 2025
‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.
Similar News
News March 6, 2025
రోడ్డు ప్రమాదాలకు ఇంజినీర్లే కారణం: గడ్కరీ

రోడ్డు ప్రమాదాలకు సివిల్ ఇంజినీర్ల తప్పులే కారణమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. డీపీఆర్, రోడ్డు డిజైన్లు సరిగా చేయట్లేదని, దీనివల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని చెప్పారు. మన దేశంలో రోడ్ సిగ్నల్స్, మార్కింగ్ సిస్టమ్స్ లాంటి చిన్న పనులు కూడా అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నారు. మనం స్పెయిన్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ నుంచి నేర్చుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
News March 6, 2025
నాకౌట్ మ్యాచుల్లో కుల్దీప్ ఫెయిల్.. మరో బౌలర్ను తీసుకోవాల్సిందేనా?

టీమ్ ఇండియా ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో అంతగా రాణించట్లేదు. అతడి రికార్డులు 2023 వన్డే WC సెమీఫైనల్లో 1/56, ఫైనల్లో 0/56, 2024 టీ20 WC సెమీఫైనల్లో 3/19, ఫైనల్లో 0/45, CT-2025 సెమీఫైనల్లో 0/44గా ఉన్నాయి. ఆదివారం జరిగే ఫైనల్లో కుల్దీప్ స్థానంలో అర్ష్దీప్ లేదా హర్షిత్ రాణాను తీసుకోవాలని పలువురు విశ్లేషకులు సూచిస్తున్నారు. మీరేమంటారు?
News March 6, 2025
నుజ్జునుజ్జయిన మారుతి సుజుకీ కారు.. సేఫ్టీ ఎక్కడ?

హైదరాబాద్ ORRపై జరిగిన కారు ప్రమాదపు ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. వాటర్ ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో మారుతి సుజుకీ బ్రెజా కారు నుజ్జునుజ్జయి ఇద్దరు చనిపోయారు. ఈ మోడల్ కారు 5కు 4 Global NCAP rating సాధించినా ఇంతలా డ్యామేజ్ అవ్వడంపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. మైలేజీ కోసం చూసుకుని ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, కంపెనీ సైతం వినియోగదారుల ప్రాణాలను లెక్కచేయట్లేదని విమర్శలొస్తున్నాయి.