News March 6, 2025

‘సూపర్ 6’కు కేటాయింపులు ఏవి?: అంబటి

image

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకూ నిధులు లేవా? అని ఎద్దేవా చేశారు. జగన్ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వం ఇప్పటికీ సమాధానం చెప్పలేదని విమర్శించారు. అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పిన నేతలు కేటాయింపులు ఎందుకు చేయలేదని నిలదీశారు. CMగా ఉన్న వ్యక్తి పక్కపార్టీ వారికి సాయం చేయొద్దని చెబుతారా? అని ప్రశ్నించారు.

Similar News

News February 8, 2026

జీడిమామిడిలో ఆకు, పూత, కాయమచ్చ తెగులు నివారణ

image

ఈ తెగులు వల్ల జీడిమామిడి చెట్టు ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోతుంది. చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. ఈ తెగులు నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలను తొలగించాలి. లీటరు నీటికి మ్యాంకోజెబ్ 1 గ్రాము లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా క్లోరోథాలోనిల్ 1ml కలిపి పిచికారీ చేసుకోవాలి.

News February 8, 2026

భాను సప్తమి: నేడు ఏం చేయాలంటే?

image

భాను సప్తమి నాడు ఆదిత్యుడి 12 పేర్లు పలుకుతూ సూర్య నమస్కారాలు చేయాలి. దీంతో శరీరానికి శక్తి, మనసుకు ప్రశాంతత లభిస్తాయి. అర్ఘ్యం సమర్పిస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. జాతక దోషాలు పోతాయి. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కోసం ‘ఆదిత్య హృదయం’ పఠించాలి. రామరావణ యుద్ధంలో రాముడికి అగస్త్య మహాముని ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు. నేడు చేసే దానం ఎంతో ఫలప్రదం. భాను సప్తమి వ్రతం ఆచరించడం అన్నింటికంటే ఉత్తమం.

News February 8, 2026

‘అంబానీ ఇస్తేనేం.. రోహిత్‌కు డైటే ముఖ్యం’

image

T20Iలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే WC-2027 ఆడేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న వాంఖడేలో మ్యాచ్‌కు హాజరైన రోహిత్ గ్యాలరీలో బిజినెస్‌మెన్ ముఖేశ్ అంబానీతో కలిసి మ్యాచ్ చూశారు. ఈ క్రమంలో ముఖేశ్ టీ ఆఫర్ చేయగా హిట్ మ్యాన్ తిరస్కరించారు. దీంతో రిచెస్ట్ మ్యాన్ ఆఫర్ చేసినా వద్దంటూ డ్రీమ్ కోసం కఠిన డైట్ పాటిస్తున్నారని రోహిత్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.