News February 8, 2025
‘తండేల్’ తొలి రోజు కలెక్షన్లు ఎన్నంటే?

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.21.27 కోట్లు(గ్రాస్) వచ్చినట్లు తెలిపారు. అయితే చైతూ కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని సినీవర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News March 17, 2026
చావు నుంచి క్షణాల్లో తప్పించుకున్న మొజ్తబా

ఇజ్రాయెల్ దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ సహా ఇతర కుటుంబీకులు, ఇరాన్ ఉన్నతాధికారులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆ అటాక్ నుంచి ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ త్రుటిలో తప్పించుకున్నారంటూ ఆ దేశ అధికారులు మాట్లాడుకున్న ఆడియో లీకైనట్లు ‘టెలిగ్రాఫ్’ తెలిపింది. ఖమేనీ నివాసంపై మిస్సైల్ పడటానికి కొన్ని సెకన్ల ముందే మొజ్తబా గార్డెన్‌లోకి నడుచుకుంటూ వెళ్లడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారని పేర్కొంది.
News March 17, 2026
తక్కువ ఖర్చు.. ఎక్కువ లాభం: రోజూ స్వీట్ పొటాటో తింటే?

తక్కువ రేటుకు లభించే స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్-A, C, E, B6, పొటాషియం, పీచు తదితర పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ల నుంచి రక్షించే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు. ‘రోజూ చిలగడదుంప తింటే వ్యాధినిరోధక శక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. మలబద్ధకం, బీపీ, ఒత్తిడి తగ్గుతాయి. కంటి, చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt
News March 17, 2026
మిరపలో ఈ సేద్య విధానం ఆదర్శం

మిరప సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతిని అనుసరిస్తూ, తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధిస్తున్నారు కొందరు రైతులు. సేంద్రియ కషాయాల వాడకంతో పాటు బంతి, ఆముదం మొక్కలను మిరపలో పెంచి చీడల ఉద్ధృతిని తగ్గిస్తున్నారు. పంటకు హాని చేసే పురుగుల తీవ్రతను తగ్గించడానికి జిగురు అట్టలు, సోలార్ ట్రాప్స్ వాడుతున్నారు. వీడ్ కంట్రోల్ మ్యాట్స్ వాడి కలుపును అరికడుతున్నారు. ఇలా రసాయనాలు లేకుండానే అధిక దిగుబడి సాధిస్తున్నారు.


