News February 8, 2025
‘తండేల్’ తొలి రోజు కలెక్షన్లు ఎన్నంటే?

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్’ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చూసేందుకు ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రూ.21.27 కోట్లు(గ్రాస్) వచ్చినట్లు తెలిపారు. అయితే చైతూ కెరీర్లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే అని సినీవర్గాలు పేర్కొన్నాయి.
Similar News
News March 18, 2025
Way2News Exclusive: టెన్త్ విద్యార్థులకు స్కామర్ల వల

AP: ఎలాగైనా టెన్త్ పాస్ కావాలనే విద్యార్థులను కొందరు దోచుకుంటున్నారు. డబ్బులిస్తే జరగబోయే పరీక్షల క్వశ్చన్ పేపర్లు పంపుతామని టెలిగ్రామ్ ఛానళ్లలో వల వేస్తున్నారు. దీంతో అమాయక స్టూడెంట్స్ పేమెంట్స్ చేస్తే ప్రొటెక్టెడ్ PDF పంపి, పాస్వర్డ్ కోసం మళ్లీ డబ్బు లాగుతున్నారు. ఇలాంటి స్కామర్లలో ఒకరితో స్టూడెంట్‌లా Way2News చాట్ చేసింది (పైన చాట్ ఫొటోలు). విద్యార్థులూ.. ఇలాంటి స్కామర్లను నమ్మకండి.
Share It
News March 18, 2025
రేపు GATE ఫలితాల విడుదల

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE-2025) ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలలోపు రిజల్ట్స్ వెల్లడయ్యే అవకాశం ఉంది. gate2025.iitr.ac.in వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.
News March 18, 2025
మే 20న దేశవ్యాప్త సమ్మె

లేబర్ కోడ్ రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్రాన్ని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కనీస జీతం ₹26Kకు పెంచాలని, EPS కింద ₹9K పెన్షన్ ఇవ్వాలని, క్రమం తప్పకుండా ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ద్వారా కార్మికులతో సంప్రదింపులు జరపాలని కోరుతున్నాయి. ఈ మేరకు మే 20న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ రెండు నెలలపాటు కార్మికుల సమస్యలపై అన్నిరాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించనున్నాయి.