News November 16, 2024

‘కంగువా’ కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.

Similar News

News November 11, 2025

‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

image

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.

News November 11, 2025

అయ్యప్ప దీక్షా నియమాలు (1/2)

image

☞ దీక్షలో ఎల్లప్పుడూ మాల ధరించే ఉండాలి.
☞ ఎప్పుడూ నల్లని దీక్షా వస్త్రాలు మాత్రమే ధరించాలి.
☞ విభూతి, చందనం, కుంకుమ ధరించాలి.
☞ పూజ, భిక్ష సమయాల్లో చొక్కా ధరించకూడదు.
☞ కఠిన బ్రహ్మచర్యం పాటించాలి.
☞ నేలమీద నిద్రపోవాలి. మంచంపై కూర్చోరాదు.
☞ క్షురకర్మ చేయించుకోరాదు. గోళ్లు తీయకూడదు.
☞ కోపాన్ని వీడాలి. అబద్ధాలకూడదు. ☞ పాదరక్షలు ధరించరాదు. <<-se>>#AyyappaMala<<>>

News November 11, 2025

పొద్దుతిరుగుడు పంట కోతకు వచ్చినట్లు ఎలా గుర్తించాలి?

image

పొద్దుతిరుగుడు పంట కోత సమయాన్ని కొన్ని సూచనల ద్వారా మనం గుర్తించవచ్చు. పొద్దుతిరుగుడు పువ్వు వెనుక భాగం నిమ్మ పచ్చ రంగులోకి మారితే ఆ పంట కోతకు వచ్చినట్లు. అప్పుడు కోత యంత్రం చేత లేదా కూలీల సాయంతో పంటను కోయాలి. కోత అనంతరం పువ్వులను 2-3 రోజులు ఆరనివ్వాలి. తర్వాత కర్రలతో కొట్టి గాని, ట్రాక్టర్‌తో నడిపి నూర్పిడి చేసి గింజను వేరుచేసుకోవచ్చు. గింజల్లో తేమ 9 నుంచి 10 శాతం వచ్చేవరకు ఎండబెట్టాలి.