News November 16, 2024

‘కంగువా’ కలెక్షన్లు ఎంతంటే?

image

సూర్య, శివ కాంబినేషన్లో తెరకెక్కిన పీరియాడికల్ ఫాంటసీ ఫిల్మ్ ‘కంగువా’. ఈ సినిమా థియేటర్లలో విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.89.32 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. అభిమానుల నుంచి సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని పేర్కొంది.

Similar News

News December 2, 2024

UNBELIEVABLE: బ్రేక్ చేయలేని రికార్డు!

image

క్రికెట్‌లో ఎన్నో రికార్డులు నమోదై, బద్దలవుతుంటాయి. ఎవ్వరూ అందుకోలేని రికార్డులూ ఉంటాయి. అందులో సచిన్ రికార్డులు ఫస్ట్. అయితే మరో భారత క్రికెటర్ కూడా ఎవరికీ సాధ్యంకాని ఓ రికార్డు నమోదు చేశారు. 1964లో లెఫ్టార్మ్ స్పిన్నర్ బాపు నాదకర్ణి ఇంగ్లండ్‌పై వరుసగా 21 ఓవర్లు మెయిడెన్ చేశారు. ఆ మ్యాచ్‌లో మొత్తం 32 ఓవర్లు వేసి కేవలం 5 రన్స్ ఇచ్చారు. తాజాగా WI బౌలర్ జేడెన్ సీల్స్ వరుసగా 6 మెయిడెన్స్ వేశారు.

News December 2, 2024

డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

image

1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1912: దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1989: భారత దేశ 8వ ప్రధానిగా వీపీ సింగ్ నియామకం
1996: ఉమ్మడి ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం

News December 2, 2024

హైదరాబాద్‌లో భారీ వర్షం

image

TG: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వాన పడింది.