News July 17, 2024
విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ అంటే?
J&Kలో ఉగ్రమూకలను కట్టడి చేసేందుకు 1995లో నాటి కేంద్ర ప్రభుత్వం ఈ విలేజ్ డిఫెన్స్ గ్రూప్స్ తీసుకొచ్చింది. సెన్సిటివ్ ప్రాంతాల్లో గ్రామస్థుల స్వీయ రక్షణ కోసం ఇవి ఏర్పాటయ్యాయి. మాజీ జవాన్/పోలీస్ ఈ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తారు. గ్రామానికి గరిష్ఠంగా 15 మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తారు. 2023కి ఈ విలేజ్ గ్రూప్స్ సంఖ్య 4,153గా ఉంది. <<13645609>>తాజా<<>> పరిస్థితులతో J&Kలో ఈ గ్రూప్స్ కీలకంగా మారే అవకాశం ఉంది.
Similar News
News December 11, 2024
ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’!
సర్వైకల్ క్యాన్సర్ నివారణకు వ్యాక్సినేషన్‌పై 2024 బడ్జెట్‌లో కేంద్రం ప్రకటన చేసింది. అనంతరం ఈ వ్యాధితో నటి పూనమ్ పాండే మృతి చెందినట్టు ఆమె టీం ప్రకటించడం సంచలనమైంది. అయితే అదో స్టంట్‌గా తేలింది. అలాగే సంస్థలో ఉద్యోగుల ఒత్తిడిపై అవగాహన కల్పించడానికే ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేశామని <<14840427>>Yes Madam<<>> ప్రకటించింది. ఇది మరో ‘పూనమ్ పాండే స్టంట్’ అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
News December 11, 2024
తొలి T20లో పోరాడి ఓడిన పాకిస్థాన్
సౌతాఫ్రికా టూర్‌లో ఉన్న పాకిస్థాన్ డర్బన్‌లో జరిగిన తొలి టీ20లో ఓడింది. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ రిజ్వాన్ చివరి వరకు పోరాడినా(74 రన్స్) విజయం దక్కలేదు. దీంతో సౌతాఫ్రికా 11పరుగుల తేడాతో గెలిచింది. సౌతాఫ్రికా బ్యాటర్ మిల్లర్ 40 బంతుల్లో 82 రన్స్ చేశారు. 48 రన్స్ చేయడంతో పాటు 4 వికెట్లు తీసిన జార్జ్ లిండేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది.
News December 11, 2024
మూడు పూటలూ అన్నమే తింటున్నారా?
చాలామంది ఎన్ని ఆహార పదార్థాలు తిన్నా అన్నం తినకుండా ఉండలేరు. మూడు పూటలా అదే తింటారు. కానీ అన్నం ఎక్కువ మోతాదులో తీసుకుంటే షుగర్ వచ్చే ఆస్కారం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటంతో జీర్ణ సమస్యలతోపాటు ఊబకాయం బారిన పడే ఛాన్స్ ఉంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అన్నానికి బదులు ఒకపూట ఇతర ఆహార పదార్థాలు తినడం బెటర్.