News June 14, 2024
BJP మంత్రికి ఏ శాఖంటే?
* సత్యకుమార్ యాదవ్(BJP) – ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
* కొల్లు రవీంద్ర – ఎక్సైజ్, గనులు, జియాలజీ
* పొంగూరు నారాయణ – మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి
* నిమ్మల రామానాయుడు – జలవనరుల శాఖ
* ఎన్.ఎం.డీ ఫరూక్ – న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమం
Similar News
News September 7, 2024
ఒకే ఓవర్‌లో వరుసగా 4, 4, 4, 4, 4
దులీప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-Aతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-B బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ మెరుపులు మెరిపిస్తున్నారు. ఆకాశ్ దీప్ వేసిన ఇన్నింగ్స్ 10వ ఓవర్‌లో బౌండరీల వర్షం కురిపించారు. ఆ ఓవర్ తొలి బంతిని డిఫెండ్ చేసిన సర్ఫరాజ్ మిగిలిన 5 బంతుల్లో 5 బౌండరీలు బాదారు. దీంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో సర్ఫరాజ్(32), పంత్(29) ఉన్నారు.
News September 7, 2024
ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై దుమారం
కశ్మీరీ వేర్పాటువాది అఫ్జల్ గురును ఉరి తీయడం వల్ల ఏదైనా ప్రయోజనం నెరవేరినట్టు తాను భావించడం లేదని JK మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ ఎప్పటికీ ఉగ్రవాదులతోనే ఉంటుందంటూ ఆరోపించింది. అఫ్జల్‌ను ఉరితీయడం వల్ల ఎలాంటి మంచి జరగలేదంటున్న ఇండియా కూటమి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ప్రశ్నిస్తోందా అని నిలదీసింది.
News September 7, 2024
ఆ ప్రాంతాల్లో ఎల్లుండి నుంచి ప్రత్యేక డ్రైవ్: సత్యకుమార్ యాదవ్
AP: వరదలతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టామని మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. ఎల్లుండి నుంచి మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో లక్ష మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. దోమ తెరలు కూడా సరఫరా చేస్తున్నామని, కలుషిత నీటితో వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.