News May 11, 2024

కేఎల్ రాహుల్‌ను LSG ఓనర్ ఏం అన్నారంటే..

image

SRHపై ఓటమి అనంతరం LSG కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఆ జట్టు ఓనర్ గోయెంకా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఏమన్నారన్నదానిపై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ నివేదిక విడుదల చేసింది. సన్‌రైజర్స్ ఓపెనర్లు విలయతాండవం చేసిన అదే పిచ్‌పై రాహుల్ 33 బంతుల్లో 29 రన్స్ చేయడం, ఆటగాళ్లలో గెలవాలన్న కసి కనిపించకపోవడం, అత్యంత పేలవమైన బౌలింగ్.. ఈ అంశాలపై గోయెంకా రాహుల్‌ను నిలదీసినట్లు నివేదిక పేర్కొంది.

Similar News

News February 19, 2025

నేడు గుంటూరులో వైఎస్ జగన్ పర్యటన

image

AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు గుంటూరులో పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మిర్చి యార్డ్‌కు చేరుకోనున్నారు. మిర్చికి గిట్టుబాటు ధరను డిమాండ్ చేస్తూ అక్కడి రైతులకు సంఘీభావం తెలుపనున్నారు. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ పర్యటనకు ఈసీ నుంచి ఎలాంటి స్పందన ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్త ఫీజు పోరు నిరసనల్ని కోడ్ దృష్ట్యా వైసీపీ వాయిదా వేసుకుంది.

News February 19, 2025

నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

image

AP: నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉ.9 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అంకురార్పణ పడనుంది. వేడుకల్లో భాగంగా ఆర్జిత సేవలను రద్దు చేశారు. సాధారణ భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం ఉంటుంది. ఇప్పటికే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

News February 19, 2025

నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

image

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

error: Content is protected !!