News August 9, 2024
సిల్వర్ గెలిచాక నీరజ్ చోప్రా ఏమన్నారంటే?

పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ గెలిచాక నీరజ్ చోప్రా మాట్లాడుతూ స్వర్ణ విజేత అర్షద్ నదీమ్‌కు అభినందనలు తెలిపారు. ‘2016 నుంచి అతనితో పోటీ పడుతున్నాను. కానీ తొలిసారిగా ఓడిపోయాను. అర్షద్ నిజంగా చాలా కష్టపడ్డాడు. ఇవాళ నాకన్నా ఉత్తమ ప్రదర్శన చేశాడు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఇతర అథ్లెట్ల వలె తనకు వసతులు లేవని, ఉన్నవాటితోనే కష్టపడినట్లు గోల్డ్ విన్నర్ నదీమ్ చెప్పారు.
Similar News
News November 9, 2025
రెండో అనధికారిక టెస్ట్.. ఇండియా-A ఓటమి

సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో ఇండియా-A ఓడింది. భారత్ నిర్దేశించిన 417 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బవుమా సహా మరో నలుగురు బ్యాటర్లు హాఫ్ సెంచరీలు చేశారు. అటు భారత జట్టులో జురెల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు బాదారు. అంతకుముందు తొలి అనధికారిక టెస్టులో IND గెలిచింది. కాగా ఈనెల 14 నుంచి IND, SA మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
News November 9, 2025
జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

జపాన్‌లో 6.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇవాటే ప్రావిన్సు తీరంలో 10కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అటు అండమాన్, నికోబార్ దీవుల్లోనూ ఈ మధ్యాహ్నం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించి వివరాలు వెల్లడి కాలేదు.
News November 9, 2025
ష్.. ఊపిరి పీల్చుకో..!

జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార పర్వం ముగిసింది. 2 వారాలుగా మోగిన మైకులు, ఉపన్యాసాలిచ్చిన నేతల గొంతులు సైలెంట్ అయ్యాయి. ఎన్నికల 48గం. ముందు సైలెన్స్ పీరియడ్ రూల్‌తో జూబ్లీహిల్స్ ప్రస్తుతం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోంది. విమర్శలు, సవాళ్లు, సెంటిమెంట్లు, డెవలప్మెంట్లు సహా ఎన్నో విన్న ప్రజాస్వామ్య దేవుళ్లు ఈ నెల 11న తమ తలరాత రాసుకోనున్నారు. అటు బిహార్‌లోనూ రెండో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది.


