News January 19, 2025

‘రాబిన్ హుడ్’ ప్రమోషన్స్‌పై డైరెక్టర్ ఏమన్నారంటే?

image

టాలీవుడ్ హీరో నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా మార్చి 28న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. చాలా సమయం ఉందని, కొత్త తరహాలో ప్రచారాన్ని చేసి పబ్లిసిటీ తెచ్చుకోవాలని ఓ సినీ జర్నలిస్టు డైరెక్టర్ వెంకీ కుడుములకు సూచించారు. దీనికి వెంకీ స్పందిస్తూ.. ‘‘మీది ఏ సిటీ అని ఎవరైనా అడిగితే పబ్లి‘సిటీ’ అని చెప్పేంత రేంజ్‌లో ప్లాన్ చేస్తాం సార్’’ అని ఆయన రిప్లై ఇచ్చారు.

Similar News

News February 9, 2025

CCL: తెలుగు వారియర్స్ ఓటమి

image

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.

News February 9, 2025

ఫిబ్రవరి 9: చరిత్రలో ఈరోజు

image

1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం
1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు
1975: సినీ నటుడు సుమంత్ జననం
2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం
2021: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం (ఫొటోలో)

News February 9, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 09, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!